loader

పవన్ కల్యాణ్‌కి మానసిక స్థితి బాగా లేదు: రోజా

‘ఈ రాష్ట్రంలో గాల్లో గెలిచిన గాలిగాళ్లు ఎక్కువయ్యారు’ అంటూ రోజా మండిపడ్డారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే టీడీపీ, జనసేన నేతలు అమెరికా పారిపోవాల్సిందేనని అన్నారు. ఇప్పటికే చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ హైదరాబాద్ వదిలి విదేశాల దిశగా వెళ్తున్నారని, రేపు అమెరికా బాట పడతారని విమర్శించారు. పవన్ కల్యాణ్‌కి మానసిక స్థితి సరిగా లేదంటూ, “ఎక్కడికి వెళ్లినా అక్కడే పుట్టానంటున్నాడు” అంటూ ఆమె ఎద్దేవా చేశారు

పార్లమెంట్‌ ఆవరణలో ప్రతిపక్ష ఎంపీల నిరసన..

బీహార్‌లో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివ్యూ (SIR) పేరుతో ఓటర్ల జాబితాను సవరించడానికి వ్యతిరేకంగా బీజేపీ వ్యతిరేక ఓటర్లను జాబితా నుంచి తొలగించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తు పార్లమెంట్‌ భవనం ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలు నిరసన ప్రదర్శన చేశారు. లోక్‌సభ లో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ, సమాజ్‌వాది పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ సహా ప్రతిపక్ష ఎంపీలంతా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపీలు నినాదాలు చేశారు.

స్నేహితులే హంతకులు.. కాంగ్రెస్ నేత హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

మెదక్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి అనిల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆస్తి వివాదాలే హత్యకు కారణమని స్నేహితులే హంతకులు అని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. కాంగ్రెస్ నేత రవీందర్ రెడ్డి ప్రధాన నిందితుడు. రవీందర్ రెడ్డికి, అనిల్‌కు మధ్య పెట్రోల్ బంక్ విషయంలో వివాదం నడుస్తోంది. రవీందర్ రెడ్డితో పాటు నాగభూషణం, నాగరాజు కలిసి అనిల్‌ను హత్య చేయాలని పథకం వేశారు. బిహార్‌లో తుపాకీ కొనుగోలు చేసి, షాబుద్దిన్ అనే వ్యక్తితో షూటింగ్ ప్రాక్టీస్ చేయించారు. […]

కేరళ మాజీ సీఎం వి.ఎస్. అచ్యుతానందన్ కన్నుమూత!

కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కమ్యూనిస్ట్ నాయకుడు వి.ఎస్. అచ్యుతానందన్ (101) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో తిరువనంతపురంలోని ఎస్.యు.టి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సొమవారం మధ్యహ్నం తుదిశ్వాస విడిచారు. 1964లో CPI జాతీయ మండలి నుండి తప్పుకున్న 32 మంది నాయకులలో VS కూడా ఒకరు. ప్రస్తుతం ఆయన CPM వ్యవస్థాపక నాయకులలో ఒకరిగా ఉన్నారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, CPM రాష్ట్ర కార్యదర్శి, పొలిట్‌బ్యూరో సభ్యుడు, LDF కన్వీనర్, సహా అనేక పదవులను […]

ప్రతిపక్ష నేతగా పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశం నాకు ఇవ్వట్లేదు : రాహుల్‌ గాంధీ

పార్లమెంట్‌ వర్షాకాల సమావేలు ఇవాళ ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ తనను మాట్లాడనివ్వట్లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఈ సమావేశాల్లో అధికార పక్షం పక్షపాతంతో వ్యవహరిస్తోందని విమర్శించారు. రక్షణ మంత్రి, ప్రభుత్వంలోని ఇతర మంత్రులకు మాట్లాడటానికి అనుమతి ఇచ్చారని.. తనకు మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు.

పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడినవాళ్లు ఎక్కడున్నారు: ఖర్గే

ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో గందరగోళం నెలకొంది. లోక్ సభ, రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇండియా కూటమి, విపక్షాలు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, ఎంపి మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ. పహల్గామ్ ఉగ్రదాడికి ఇంటెలిజెన్స్ వైఫల్యమే కారణమని జమ్మూ గవర్నర్ చెప్పారన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడినవాళ్లు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. నేనే యుద్ధం ఆపానంటూ డోనాల్డ్ ట్రంప్ 20 సార్లు చెప్పుకున్నారని.. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలని ఖర్గే డిమాండ్ […]

తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అస్వస్థత.. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స

తమిళనాడు సీఎం స్టాలిన్‌ అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని అపోలో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు హెల్త్‌ బుటెలిన్‌ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయనకు ఇంకొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు అపోలో వైద్యులు తెలిపారు. ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో స్టాలిన్‌ ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది. ఆయనకు తల తిరుగుతున్నట్లు అనిపించడంతో రెగ్యులర్‌ చెకప్‌లో భాగంగా  ఆయనను చెన్నైలోని అపోలో హాస్పిటల్‌కు […]

ముద్రగడ పద్మనాభాన్ని హైదరాబాద్‌కు తరలించారు.. వైఎస్ జగన్ సూచనతో నిర్ణయం

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డిని కాకినాడ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. కుటుంబ సభ్యులు కిర్లంపూడికి తీసుకువెళ్లిన తర్వాత, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ముద్రగడ పద్మనాభం వెంట ఆయన కుమారుడు గిరిబాబు, ఇతర కుటుంబసభ్యులు ఉన్నారు. ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించనున్నారు. ముద్రగడ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. కాకపోతే వైఎస్ జగన్ సూచనతో.. ముందస్తు జాగ్రత్తగా, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించినట్లు చెబుతున్నారు

శశి థరూర్ ఇకపై మాలో ఒకరు కాదు..

కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ శశి థూరూర్‌ కు మధ్య దూరం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ‘థరూర్ తన అభిప్రాయం మార్చుకున్న రోజు నుంచి ఆయనతో సంబంధాలు తెంచుకున్నాం. అందుకే తిరువనంతపురంలో మేము నిర్వహించే పార్టీ కార్యక్రమాలకు ఎంపీని పిలవకూడదని నిర్ణయించుకున్నాం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సభ్యుడైన థరూర్‌ ఇకపై మాలో ఒకరు కాదు. ఆయనపై ఎలాంటి చర్యలను తీసుకోవాలనేది జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుంది’ అని మురళీధరన్ అన్నారు.

బీహార్‌లో ఎన్నిక‌ల ఓట‌ర్ల స‌వ‌ర‌ణ‌పై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు : కేటీఆర్

బీహార్‌లో జరుగుతున్న ఎన్నికల ఓటర్ల సవరణ ఇది మొదటిసారి కాదు. అయితే ఈసారి మాత్రం తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భారత ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? అని ప్ర‌శ్నించారు. బీహార్‌లో జరుగుతున్న పరిణామాల పట్ల మాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. దేశంలోని మిగతా రాష్ట్రాలపై దీని ప్రభావం ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON