తమిళనాడు సీఎం స్టాలిన్ అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని అపోలో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు హెల్త్ బుటెలిన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయనకు ఇంకొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు అపోలో వైద్యులు తెలిపారు. ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో స్టాలిన్ ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది. ఆయనకు తల తిరుగుతున్నట్లు
అనిపించడంతో రెగ్యులర్ చెకప్‌లో భాగంగా ఆయనను చెన్నైలోని అపోలో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.

