కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ శశి థూరూర్ కు మధ్య దూరం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ‘థరూర్ తన అభిప్రాయం మార్చుకున్న రోజు నుంచి ఆయనతో సంబంధాలు తెంచుకున్నాం. అందుకే తిరువనంతపురంలో మేము నిర్వహించే పార్టీ కార్యక్రమాలకు ఎంపీని పిలవకూడదని నిర్ణయించుకున్నాం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సభ్యుడైన థరూర్ ఇకపై మాలో ఒకరు కాదు. ఆయనపై ఎలాంటి చర్యలను తీసుకోవాలనేది జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుంది’ అని మురళీధరన్ అన్నారు.

