ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో గందరగోళం నెలకొంది. లోక్ సభ, రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇండియా కూటమి, విపక్షాలు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, ఎంపి మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ. పహల్గామ్ ఉగ్రదాడికి ఇంటెలిజెన్స్ వైఫల్యమే కారణమని జమ్మూ గవర్నర్ చెప్పారన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడినవాళ్లు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. నేనే యుద్ధం ఆపానంటూ డోనాల్డ్ ట్రంప్ 20 సార్లు చెప్పుకున్నారని.. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలని ఖర్గే డిమాండ్ చేశారు.

