loader

ఈసారి కార్యకర్తలకే అత్యధిక ప్రాధాన్యం: వైఎస్ జగన్

ఈసారి కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెల్లడించారు. ‘కార్యకర్తలకు మంచి ఇన్సూరెన్స్‌ కల్పిస్తాం. మన పార్టీకి 15 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రజల్లో మనం బలంగా ఉన్నాం. ఇంకా బలోపేతం కావాలి. కాబట్టి గ్రామ కమిటీలే ఏర్పాటు కాగానే బూత్‌ లెవెల్‌ కమిటీలు కూడా ఏర్పాటు కావాలి. మన పార్టీ మరో 30, 40 ఏళ్లపాటు కొనసాగాలంటే కార్యకర్తలు చాలా ముఖ్యం.’అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు.

రెడ్‌బుక్‌ తరహాలో వైసీపీ యాప్‌.. వైఎస్‌ జగన్‌ వార్నింగ్‌

వైసీపీ కూడా రెడ్‌బుక్‌కు అడ్వాన్స్‌డ్‌గా డిజిటల్‌ ఉద్యమానికి సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం, కూటమి నాయకుల అండ కారణంగా ఏ అన్యాయం జరిగినా నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేసేందుకు ఒక యాప్‌ తెచ్చేందుకు సిద్ధమైంది. ఫలానా వ్యక్తి, ఫలానా అధికారి కారణంగా అన్యాయంగా ఇబ్బంది పడ్డానని ఆ యాప్‌లో ఫిర్యాదు చేసి, ఆధారాలు అప్‌లోడ్‌ చేస్తే సరిపోతుందని జగన్‌ తెలిపారు. తప్పు చేసిన వారందరికీ సినిమా చూపించడం ఖాయమని అన్నారు. చంద్రబాబు ఏదైతే విత్తారో అదే చెట్టవుతుందని చెప్పారు.

బీసీ రిజర్వేషన్ల కోసం 72 గంటలపాటు దీక్షకు రెడీ- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

బీసీ బిల్లు సాధన కోసం మూడు రోజులపాటు దీక్ష చేయడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిర్ణయం తీసుకున్నారు. బీసీ బిల్లు ప్రాముఖ్యత చాటి చెప్పేందుకు ఆగస్టు 4, 5, 6 తేదీల్లో 72 గంటలపాటు దీక్ష చేపడతానని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకుని నిరాహారదీక్ష చేస్తామన్నారు. ఒకవేళ పర్మిషన్ ఇవ్వకుంటే ఎక్కడ కూర్చుంటే అక్కడే నిరాహారదీక్షకు సిద్ధమని స్పష్టంచేశారు.

హరిహర వీరమల్లు సినిమాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. వైసీపీపై మండిపడ్డ నాగబాబు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నటించిన హరిహర వీరమల్లు చిత్రంపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ నాగబాబు మండిపడ్డారు. ఇది చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీని, ఆ నేతలను ఏమనాలో అర్థం కావడం లేదని తెలిపారు. వైసీపీ అరాచకాలపై పోరాటం చేయాలని జనసేన కార్యకర్తలకు సూచించారు. మంత్రి పదవిపై నాగబాబు స్పందిస్తూ.. తనకు పదవులపై ఆశ లేదని తెలిపారు. జనసేన కార్యకర్తగా ఉండటమే తనకు ఇష్టమని స్పష్టం చేశారు.

మీనాక్షి నటరాజన్ పాదయాత్ర…ముహూర్తం ఖరారు

ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ తెలంగాణలో పాదయాత్ర చేయనున్నారు. స్థానిక సంస్తల ఎన్నికలు త్వరలోనే జరగనున్న నేపథ్యంలో పార్టీ బలోపేతం చేసే పనిలో భాగంగా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం నుంచి ఈ పాదయాత్ర షురూ కానున్న పాదయాత్రలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తోపాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఇన్‌చార్జిమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు […]

పాలన గాలికి.. ప్రగతి కాటికి.. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికీ మద్యం: కేటీఆర్‌

ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికీ మద్యం అంటూ.. మేజర్‌ పంచాయతీల వరకే పరిమితమైన మద్యం దుకాణాలను పల్లెలకు విస్తరించాలన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. గతంలో మద్యం అమ్మకాలపై విమర్శలు చేసిన హస్తం పార్టీ, అధికారం దక్కించుకున్న తర్వాత ఆదాయం కోసం మద్యం అమ్మకాలనే నమ్ముకున్నదని ధ్వజమెత్తారు. నాడు ప్రగతి బాట పట్టిన తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారని విమర్శించారు.

బీహార్ లో 64 లక్షల ఓటర్ల తొలగింపు

బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా 64 లక్షల బోగస్ ఓటర్లను తొలగించడం ద్వారా ఎన్నికల జాబితా ప్రక్షాళన పూర్తయినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. జూన్ 24 నుంచి జూలై 25 వరకూ నెల్లాళ్ల పాటు ఈ రివిజన్ చేపట్టారు. అక్టోబర్, నవంబర్ లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు గతంలో 7.89 కోట్ల మంది తో ఉన్న ఓటర్ల జాబితా సర్ తర్వాత ప్రస్తుతం 7.23 కోట్ల మంది ఓటర్లతో ఉంది.

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సీఏం.. విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యులు

వారం రోజుల క్రితం తల తిరగడంతో చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్లో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కోలుకున్నారు గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రి నుంచి ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి స్టాలిన్ డిశ్చార్జి అయ్యారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నప్పటికీ మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించాం. అ తర్వాత ఆయన యాధావిధిగా తన బాధ్యతల్లో మునిగిపోవచ్చు’ అని డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ అనిల్ బీజీ మీడియాకు తెలిపారు.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇంట్లో బాంబ్ కలకలం!

సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్టుగా ఓ బెదిరింపు కాల్, తమిళనాడులో కలవరం క్రియేట్ చేసింది. చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్‌లోని నీలంగరైలో ఉన్న విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్టుగా ఓ గుర్తు తెలియని వ్యక్తులు, పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేశారు. దీంతో మూడు  బాంబ్ స్క్యాడ్  , స్నిఫర్ డాగ్.. విజయ్ ఇంట్లో సునిశితంగా పరిశీలించి, తనిఖీలు చేపట్టారు. అయితే ఇంట్లో ఎలాంటి పేలుడు […]

కెటిఆర్.. 300 ఓట్ల మెజారిటీతో ఎలా గెలిచావో నాకు తెలుసు: సిఎం రమేష్

ఆంధ్రప్రదేశ్ బిజెపి ఎంపి సిఎం రమేష్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ ను బిజెపిలో విలీనం చేస్తామని చెప్పలేదా? అంటూ కెటిఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. కవితను రిలీజ్‌ చేస్తే బిఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానని చెప్పిన మాట మరిచావా?. నా వల్లే నువ్వు ఎన్నికల్లో గెలిచావు. 300 ఓట్ల మెజారిటీతో ఎలా గెలిచావు నాకు తెలుసు. నీ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి.. సంస్కారం అడ్డువచ్చి చెప్పలేదు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON