బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా 64 లక్షల బోగస్ ఓటర్లను తొలగించడం ద్వారా ఎన్నికల జాబితా ప్రక్షాళన పూర్తయినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. జూన్ 24 నుంచి జూలై 25 వరకూ నెల్లాళ్ల పాటు ఈ రివిజన్ చేపట్టారు. అక్టోబర్, నవంబర్ లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు గతంలో 7.89 కోట్ల మంది తో ఉన్న ఓటర్ల జాబితా సర్ తర్వాత ప్రస్తుతం 7.23 కోట్ల మంది ఓటర్లతో ఉంది.

