loader

టీడీపీ ఎమ్మెల్యే హత్యకు కుట్ర అంతా నాటకం..ఆ రౌడీలంతా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మనుషులే

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి హత్యకు కుట్ర వీడియోపై మాజీమంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. అదంతా కోటంరెడ్డి ఆడుతున్న పెద్ద నాటకమని.. రౌడీ గ్యాంగ్‌లను పెంచి పోషించిందే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాదా? ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న వ్యక్తులంతా ఎమ్మెల్యే కోటంరెడ్డి, మరో టీడీపీ నేత రూప్‌కు సంబంధించిన మనుషులేనని, పెరోల్ ఇప్పించే విషయంలో అడ్డంగా దొరికిపోయినందునే…ఆ అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ కొత్త డ్రామాకు తెరలేపారని […]

కేతిరెడ్డి పెద్దారెడ్డికి భారీ ఊరట.. సుప్రీంకోర్టులో లైన్ క్లియర్, తాడిపత్రికి రీఎంట్రీ

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. తన సొంత నియోజకవర్గం తాడిపత్రికి వెళ్లేందుకు ఆయనకు ఎట్టకేలకు లైన్‌ క్లియర్‌ అయింది. తాడిపత్రి నియోజకవర్గంలోకి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎలాంటి అభ్యంతరం లేకుండా వెళ్లొచ్చని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలపై.. సుప్రీంకోర్టు స్టే విధించింది.

జనసేన పార్టీని నిలబెట్టేందుకే సినిమాలు చేస్తున్నా… డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

జనసేన పార్టీ 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన జన సైనికులు, వీర మహిళలు, వివిధ వృత్తి, వ్యాపార, ఉద్యోగ వర్గాల ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ఉద్దానం కిడ్నీ సమస్యకు పరిష్కారం, రోడ్లు బాగుపడాలి అని గుడ్ మార్నింగ్ సీఎం సార్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం జనసేన పార్టీ విధానాలు అని పవన్ కల్యాణ్ తెలిపారు. పోరాట యాత్రలో భాగంగా సినిమాలు మానేద్దామని భావించాను. పార్టీని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో సినిమాలు తప్పనిసరై చేస్తున్నాను. ’అని డిప్యూటీ […]

తలను నరికి టేబుల్‌ మీద పెట్టాలి.. అమిత్‌షాపై ఎంపీ మహువా మొయిత్రా వివాదాస్పద వ్యాఖ్యలు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాపై తృణమూల్‌ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చొరబాటుదారులును ప్రోత్సహించే వాళ్లను విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోదీ అన్నారని , కాని చొరబాట్లను అరికట్టడంలో అమిత్‌షా విఫలమయ్యారని అన్నారు. అమిత్‌షా తల నరికి టేబుల్‌పై పెట్టాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో చొరబాట్లకు బీఎస్‌ఎఫ్‌ కారణమని ఆరోపించారు మహువా మొయిత్రా.. కాగా..తృణమూల్‌ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.. […]

కార్యకర్తలకు అండగా ఉండాలి.. జనసేన నాయకులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.మూడురోజుల సమావేశాల్లో భాగంగా గురువారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు వారి నుంచి ఫీడ్‌ బ్యాక్ తీసుకున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, పార్టీలో అంతర్గత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తాచాటేలా బూత్‌ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నామని..అందరూ కష్టపడి పని చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు.. కూటమిలో భాగంగా ఉన్న జనసేన పార్టీ ప్రజా సమస్యల పరిష్కారంపై […]

నేటి నుంచి విశాఖలో జనసేన సమావేశాలు

జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ‘సేనతో సేనాని’ నేటి నుంచి విశాఖపట్నంలో ప్రారంభం కానుంది. ఈ రోజు పవన్ కల్యాణ్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో, ఆగస్టు 29న,పార్లమెంటరీ నియోజకవర్గాల క్రియాశీలక కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రతినిధులతో పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆగస్టు 30న, ఈ సమావేశాల చివరి రోజు, అల్లూరి సీతారామరాజు ప్రాంగణం (ఇందిరా గాంధీ స్టేడియం) నుంచి పవన్ కల్యాణ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు..

బీహార్ గ్రామాల్లో రేవంత్ రెడ్డిని కర్రలతో ఉరికించి కొడతారు: ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జన్ సురాజ్ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ఎవరు?, బీహార్‌లో ఆయన హోదా ఏమిటి? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గతంలో బీహార్ ప్రజలను అవమానించారని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. బీహార్‌ను అవమానించే నాయకులతో తిరుగుతున్న రాహుల్ గాంధీ మనస్తత్వాన్ని ఇది ప్రతిబింబిస్తుందని ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి బీహార్‌లోని ఏ గ్రామానికి వెళ్లినా, ప్రజలు కర్రలతో తరిమి కొడతారని హెచ్చరించారు.

ఈడీ దాడులు నుంచి తప్పించుకోడానికి ఫోన్ చెరువులో విసిరేసి.. గోడదూకిన ఎమ్మెల్యే..!

పశ్చిమ్ బెంగాల్‌లో రాజకీయ ప్రకంపనలు రేపుతోన్న టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) దూకుడు పెంచింది. బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ నాయకులు నివాసాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ముర్షిదాబాద్ జిల్లాలో ఈడీ అధికారుల నుంచి తప్పించుకోడానికి టీఎంసీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహా ప్రయత్నించాడు. తన మొబైల్ ఫోను చెరువులో విసిరేసి, గోడదూకి పారిపోయేందుకు యత్నించి, చివరకు దొరికిపోయాడు.

బుల్లెట్‌ బండిపై బిహార్ వీధుల్లో రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్

బిహార్‌లో జరిగిన ఓ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు.. దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా భారత కూటమి నాయకులు రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ ఇద్దరూ కలిసి.. బుల్లెట్ బైకుపై ప్రయాణించారు. తమ ‘ఓటర్ అధికార్ యాత్ర’కు సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. ఈయాత్రలో భాగంగానే రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ ఇద్దరూ అరేరియాలోకి ప్రవేశించగా.. ఇద్దరూ కలిసి బుల్లెట్ బైక్‌లపై ప్రయాణించారు. తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీలు బైక్ నడుపుతుండగా.. వెనుక కార్యకర్తలు కూర్చున్నారు.

బీహార్‌లో ఉత్సాహంగా సాగుతున్న ఓటర్ అధికార్ యాత్ర

బీహార్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరియు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’ విస్తృతంగా కొనసాగుతోంది. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ యాత్ర ప్రారంభమైంది. ఆదివారం అరరియా జిల్లాలో ఇద్దరు నాయకులు బుల్లెట్ బైక్‌పై ప్రయాణించి ప్రజల దృష్టిని ఆకర్షించారు. రోడ్లపై భారీ సంఖ్యలో ప్రజలు చేరుకుని వారిని ఆత్మీయంగా అభివాదం చేశారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON