ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.మూడురోజుల సమావేశాల్లో భాగంగా గురువారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, పార్టీలో అంతర్గత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తాచాటేలా బూత్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నామని..అందరూ కష్టపడి పని చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు.. కూటమిలో భాగంగా ఉన్న జనసేన పార్టీ ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టిసారించాలంటూ కోరారు.

