loader

కేంద్రప్రభుత్వ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఉద్యోగాలు

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) 1543 ఖాళీలను భర్తీ చేస్తోంది. ఫీల్డ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) – 532, ఫీల్డ్ ఇంజనీర్ (సివిల్) – 198, ఫీల్డ్ సూపర్‌వైజర్ (ఎలక్ట్రికల్) – 535, ఫీల్డ్ సూపర్‌వైజర్ (సివిల్) – 193, ఫీల్డ్ సూపర్‌వైజర్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్) – 85 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 17, 2025. అభ్యర్థులు www.powergrid.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

‘బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ’.. వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై.. మాజీ సీఎం, వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు పొడిచారని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తమ పాలనలో మహిళలకు కోట్ల రూపాయలు అందిస్తే.. ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ వారిని పేదరికంలోకి నెట్టిందని ఆరోపించారు. మొత్తం 16 రకాల బస్సులో 5 రకాల బస్సుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం, 1,560 ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 950 నాన్‌స్టాప్ బస్సులు ఉన్నాయని.. వాటిలో ఉచిత ప్రయాణం లేదంటూ బోర్డులు పెట్టడం మహిళలను మోసం […]

“ఎవరూ పదవీ విరమణ చేయాలని ఎప్పుడూ చెప్పలేదు”: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన మూడు రోజుల సమావేశం చివరి రోజున, RSS చీఫ్ మోహన్ భగవత్ అనేక ముఖ్యమైన అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా 75 ఏళ్లు నిండిన వారు పదవి విరమణ చేయాలన్న నిబంధనలను ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తోసిపుచ్చారు. “నేను పదవీ విరమణ చేస్తానని గానీ 75 ఏళ్లు నిండినప్పుడు మరొకరు పదవీ విరమణ చేయాలని గానీ నేను ఎప్పుడూ చెప్పలేదు..” అని […]

కార్యకర్తలకు అండగా ఉండాలి.. జనసేన నాయకులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.మూడురోజుల సమావేశాల్లో భాగంగా గురువారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు వారి నుంచి ఫీడ్‌ బ్యాక్ తీసుకున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, పార్టీలో అంతర్గత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తాచాటేలా బూత్‌ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నామని..అందరూ కష్టపడి పని చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు.. కూటమిలో భాగంగా ఉన్న జనసేన పార్టీ ప్రజా సమస్యల పరిష్కారంపై […]

క‌ళాశాల‌ను ముంచేసిన వ‌ర‌ద.. విద్యార్థుల అవస్థలు

కుండపోత వర్షాలు జమ్మూ అంతటా విధ్వంసం సృష్టించాయి. ప్రభుత్వ గాంధీ మెమోరియల్ (GGM) సైన్స్ కళాశాల, క్లస్టర్ విశ్వవిద్యాలయం ప్రాంగణం చిన్నపాటి చెరువును తలపించింది. విద్యార్థులు తమ బ్యాగులను తలపై మోసుకుంటూ వదల్లోంచి బయటకు వెళ్తున్నారు.హాస్టళ్లు, తరగతి గది భవనాలు వంటి లోతట్టు ప్రాంతాలలోకి నీరు ప్రవేశించటంతో సాధారణ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యా భవనాలకు ప్రవేశం దాదాపు అసాధ్యంగా మారింది. దీంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు.

ఉల్లి రైతులకు గుడ్‌న్యూస్ …క్వింటాకు రూ.1200 చెల్లించి కొనుగోలు

రాష్ట్ర సచివాలయంలో రైతుల నుంచి ఉల్లి కొనుగోళ్లపై గురువారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఉల్లి రైతులకు నష్టం వాటిల్లకూడదు. క్వింటా ఉల్లిని రూ. 1200 చొప్పున కొనుగోలు చేయండి. తక్షణం కొనుగోళ్లు ప్రారంభించాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ నుంచి నష్టాన్ని భరించాలి. కమ్యూనిటీ హాళ్లల్లో అద్దెకు తీసుకుని ఆరబెట్టాలి. ఆరబెట్టిన ఉల్లిని రైతు బజార్లకు పంపిణీ చేయాలి. ఉల్లికి రేటు వచ్చేంత వరకూ కమ్యూనిటీ హాళ్లల్లో నిల్వ చేసుకునేందుకు రైతులకు అవకాశం కల్పించాలి. అని సీఎం చంద్రబాబు […]

మోదీ సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించిన ఆన్‌లైన్ గేమింగ్ సంస్థ!

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దేశంలోని ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీ అయిన A23, కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్-మనీ ఆధారిత గేమ్‌లపై నిషేధాన్ని సవాలు చేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. ఈ చట్టం నైపుణ్యాల ఆధారంగా ఆన్‌లైన్ ఆటలను ఆడే చట్టబద్ధమైన వ్యాపారాన్ని నేర వర్గంలోకి తీసుకువస్తుంది. ఈ చట్టం రమ్మీ, పోకర్ వంటి నైపుణ్య ఆటలకు వర్తింపజేశారు, దీనిని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరింది.విచారణ చేపట్టిన హైకోర్టు.. కేసును ఆగస్టు 30కి వాయిదా వేసింది.

టీడీపీ నాయకుల దౌర్జన్యం.. డాక్టర్‌, వైద్య సిబ్బందిపై దాడి.

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుటాగుళ్ల బెల్టు షాపు వద్ద గొడవ జరగగా గాయపడ్డ వ్యక్తిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. కొందరు టీడీపీ నాయకులు ఆసుపత్రికి చేరుకుని బాధితుడిపై దాడికి యత్నించారు. అడ్డుకున్న డాక్టర్‌, వైద్య సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. టీడీపీ నాయకుల దాడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కదిరిలో డాక్టర్లు, వైద్య సిబ్బంది నిరసన తెలిపారు. విధులను బహిష్కరించి టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

చాద‌ర్‌ఘాట్ వ‌ద్ద మూసీ ఉధృతి.. వ్య‌క్తి గ‌ల్లంతు

ఎగువ‌న కురుస్తున్న కుండ‌పోత వ‌ర్షాలకు మూసీకి వ‌ర‌ద పోటెత్తింది. మ‌రో వైపు ఉస్మాన్ సాగ‌ర్, హిమాయ‌త్ సాగ‌ర్ నుంచి కూడా మూసీలోకి నీటిని విడుద‌ల చేశారు. దీంతో మూసీ న‌ది ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. చాద‌ర్‌ఘాట్ శంక‌ర్ న‌గ‌ర్ వ‌ద్ద మూసీ ఉప్పొంగుతుండ‌గా… చూసేందుకు వెళ్లిన ఓ వ్య‌క్తి గ‌ల్లంత‌య్యాడు. అప్ర‌మ‌త్త‌మైన కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. శంక‌ర్ న‌గ‌ర్‌కు చేరుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, హైడ్రా బృందాలు క‌లిసి గ‌ల్లంతైన వ్య‌క్తి కోసం గాలిస్తున్నారు.

‘ఇస్లాంను అంతం చేస్తా’.. ఖురాన్‌ను కాల్చేస్తూ.. అమెరికా నేత వివాదాస్పద వ్యాఖ్యలు

టెక్సాస్‌లో ఇస్లాం మతాన్ని లేకుండా చేస్తానంటూ.. ఖురాన్‌ను తగులబెట్టి అమెరికా రాజకీయ నాయకురాలు వాలెంటినా గోమెజ్ సంచలనం సృష్టించారు. ముస్లింలు క్రైస్తవుల కుమార్తెలపై అత్యాచారం చేస్తారని, వారి కుమారులను చంపుతారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఒక క్రైస్తవ దేశమని.. అక్కడ ఉన్న ముస్లింలు ఇతర దేశాలకు వెళ్లిపోవాలని సూచించారు. ఇప్పుడే కాదు ఆమె గతంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలకు పాల్పడ్డారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON