loader

ఎంత ఒత్తిడి వచ్చినా… తట్టుకునే శక్తిని పెంచుకుంటూనే ఉంటాం: మోడీ

సోమవారం అహ్మదాబాద్ లో రూ.5,400 కోట్ల విలువైన పలు ప్రాజెక్టుల పనులను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ  సభలో ఆయన మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుంకాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరోసారి పరోక్షంగా స్పందించారు. ‘ఎంత ఒత్తిడి వచ్చినా.. రైతులకు హాని జరగనివ్వం’ అని చెప్పారు. నేడు ప్రపంచంలో, ప్రతి ఒక్కరూ ఆర్థిక ప్రయోజనాల ఆధారంగా రాజకీయాలు చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ అహ్మదాబాద్ గడ్డ మీద నుంచి చెబుతున్నా.. మీ ప్రయోజనాలు […]

ఎసిబికి చిక్కిన వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చుంచుపల్లి మండలం, విద్యానగర్‌కాలనీలోని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో సోమవారం ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నర్సింహారావు ఎసిబికి చిక్కారు. యూరియా అమ్మకాల తనిఖీలలో భాగంగా ఫర్టిలైజర్ షాప్ యజమానికి అసిస్టెంట్ డైరెక్టర్ షోకాజ్ నోటీసు ఇచ్చారు. దానిని ఉపసంహరించేందుకు రూ.50 వేలు డిమాండ్ చేశారు. అయితే, తాను అంత డబ్బు ఇవ్వలేనని రూ.25 వేలకు అంగీకారం కుదిరింది. ఈ డబ్బులను తన కార్యాలయంలో తీసుకుంటూ ఉండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా […]

42% రిజర్వేషన్ల అమలు మార్గాలను అన్వేషిస్తున్నాం – భట్టి

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (బీసీలకు) 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రస్తుతం ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నందున, దాని అమలుకు ఉన్న న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ రిజర్వేషన్లను న్యాయపరమైన చిక్కులు లేకుండా అమలు చేయడానికి ప్రభుత్వం పలువురు న్యాయ నిపుణుల సలహాలు తీసుకోనున్నట్లు భట్టి విక్రమార్క చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఐఐటీ, నీట్ కోచింగ్ కేంద్రాలు .. చంద్రబాబు

ఏపీలోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం కొత్తగా ఏడు ఐఐటీ, నీట్ కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదివి.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఐఐటీ-నీట్ సెంటర్లలో కోచింగ్ తీసుకుని.. ఈ ఏడాది జరిగిన ఐఐటీ, నిట్, నీట్‌ పరీక్షల్లో సత్తా చాటిన విద్యార్థులను చంద్రబాబు అభినందించారు. 55 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు సోమవారం రోజున సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. పరీక్షల సన్నద్ధత కోసం రాష్ట్ర ప్రభుత్వం అందించిన […]

గాజాలోని నాజర్‌ ఆస్పత్రిపై ఇజ్రాయెల్‌ దాడులు..

హమాస్‌ అంతమే లక్ష్యంగా గత 22 నెలలుగా గాజా నగరంపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేస్తోంది. గాజా నగరంలోని పలు ప్రాంతాలపై ఐడీఎఫ్‌ దాడులకు తెగబడింది. నాజర్‌ ఆస్పత్రిపై సోమవారం జరిపిన దాడుల్లో ముగ్గురు జర్నిలిస్టులు సహా కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల్లో ఒకరు రాయిటర్స్‌కు చెందిన హతేమ్‌ ఖలీద్‌, ఓ ఫొటోగ్రాఫర్‌ అని స్థానిక వార్తా సంస్థ తెలిపింది.

ప్రభుత్వ కార్యాలయాల్లో వాట్సాప్, పెన్‌డ్రైవ్‌లు నిషేధం

జమ్ముకశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెన్ డ్రైవ్‌ ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. అధికారిక ప్రకటనలో ఈ నిషేధాన్ని ప్రకటించారు. సివిల్ సెక్రటేరియట్‌లోని అన్ని పరిపాలనా విభాగాలు, జిల్లాల డిప్యూటీ కమిషనర్ల కార్యాలయాల్లో ఇది వర్తిస్తుంది. డేటా చోరీ, మాల్‌వేర్ దాడులు, అనధికార యాక్సెస్ లాంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఈ సమస్యలను తగ్గించడమే ఈ నిబంధనల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. వాట్సాప్, Telegram లాంటి పబ్లిక్ మెసేజింగ్ యాప్స్‌ను కూడా […]

ఈడీ దాడులు నుంచి తప్పించుకోడానికి ఫోన్ చెరువులో విసిరేసి.. గోడదూకిన ఎమ్మెల్యే..!

పశ్చిమ్ బెంగాల్‌లో రాజకీయ ప్రకంపనలు రేపుతోన్న టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) దూకుడు పెంచింది. బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ నాయకులు నివాసాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ముర్షిదాబాద్ జిల్లాలో ఈడీ అధికారుల నుంచి తప్పించుకోడానికి టీఎంసీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహా ప్రయత్నించాడు. తన మొబైల్ ఫోను చెరువులో విసిరేసి, గోడదూకి పారిపోయేందుకు యత్నించి, చివరకు దొరికిపోయాడు.

అమెరికా ఎన్ని చేసినా మేం తలొగ్గం- ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ

ఖమేనీ మరోసారి అమెరికాపై మండిపడ్డారు. తమను లొంగదీసుకోవడానికి వాషింగ్టన్ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. కానీ దానిని ఎదుర్కొనేందుకు కలిసి కటుటగా పోరాడదామని తెలిపారు. అదే సమయంలో భాగస్వామ్య పక్షాలకు పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అమెరికాకు తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఓ ప్రకటన ఆయన వెబ్సైట్లో జారీ చేశారు. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ప్రభుత్వం సహా ఇరాన్ మొత్తం తమ సైన్యానికి అండగా నిలబడిందన్నారు. అందుకే శత్రువులను గట్టిగా దెబ్బతీశామని తెలిపారు.

కంటైనర్ లారీ నుంచి 255 ల్యాప్ టాప్ లు మాయం!

శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. నాలుగు కంటైనర్లలో ముంబయి నుంచి చెన్నైకి ఒక ప్రముఖ కంపెనీకి చెందిన ఎలక్ట్రానిక్ వస్తువులు తరలించబడుతున్నాయి.అయితే అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి వద్ద ఒక్క కంటైనర్‌లోని అలారం అకస్మాత్తుగా ఆఫ్ అయింది. కంపెనీ వారు వెంటనే స్పందించారు. కానీ అప్పటికే లారీ డ్రైవర్‌ మరియు క్లీనర్‌ అక్కడి నుంచి పరారయ్యారు. కంపెనీ ప్రతినిధులు మేదరమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన ల్యాప్‌టాప్‌ల మొత్తం విలువ సుమారు రూ.1.85 కోట్లు ఉంటుందని […]

ఇవేం దిక్కుమాలిన జోకులు.. బహిరంగ క్షమాపణలు చెప్పండి! కమెడియన్లకు సుప్రీం కోర్టు ఆదేశం

వికలాంగులను లక్ష్యంగా చేసుకుని “సున్నితత్వం లేని జోకులు” వేస్తూ హాస్యం చేసినందుకు సోమవారం సుప్రీంకోర్టు హాస్యనటులపై తీవ్రంగా మండిపడింది. వారి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని, వారికి జరిమానాలు కూడా విధించాలని కోర్టు ఆదేశించింది. హాస్యనటులు సమయ్ రైనా, విపున్ గోయల్, బల్రాజ్ పరంజీత్ సింగ్ ఘాయ్, సోనాలి ఠక్కర్, నిశాంత్ జగదీష్ తన్వర్ తమ స్టాండ్-అప్ కంటెంట్‌లో వికలాంగులను ఎగతాళి చేశారని పిటిషన్‌లో ఆరోపించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON