భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చుంచుపల్లి మండలం, విద్యానగర్‌కాలనీలోని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో సోమవారం ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నర్సింహారావు ఎసిబికి చిక్కారు. యూరియా అమ్మకాల తనిఖీలలో భాగంగా ఫర్టిలైజర్ షాప్ యజమానికి అసిస్టెంట్ డైరెక్టర్ షోకాజ్ నోటీసు ఇచ్చారు. దానిని ఉపసంహరించేందుకు రూ.50 వేలు డిమాండ్ చేశారు. అయితే, తాను అంత డబ్బు ఇవ్వలేనని రూ.25 వేలకు అంగీకారం కుదిరింది. ఈ డబ్బులను తన కార్యాలయంలో తీసుకుంటూ ఉండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

