loader

నేషనల్ సివిల్ సర్వీసెస్ డే

ప్రజా సేవ పట్ల అంకితభావం కనబరిచిన సివిల్ సర్వెంట్లను గౌరవించడానికీ, పరిపాలనలో శ్రేష్ఠతను ప్రోత్సహించడానికీ భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21న జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మొదటి హోం మంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 1947లో చేసిన ప్రసంగంలో సివిల్ సర్వెంట్లను “భారతదేశపు ఉక్కు చట్రం”గా అభివర్ణించారు. ఆ ప్రసంగాన్ని స్మరించుకుంటూ ఈ రోజును జరుపుకుంటారు.

తిలక్ సెంచరీతో కుదేలైన గుజరాత్.. ముంబైకి రెండో విజయం..!

పంతొమ్మిదో సీజన్‌లో ముంబై ఇండియన్స్ రెండో విజయంతో మురిసింది. వరసగా నాలుగు ఓటములనుంచి తేరుకున్న ముంబైకి తిలక్ వర్మ(101 నాటౌట్) సునామీ సెంచరీతో భారీ స్కోరందించగా.. బంతితో అశ్వనీ కుమార్‌(4-24) గుజరాత్ టైటన్స్ మిడిలార్డర్‌ను కూల్చాడు. ఈ సీజన్‌లో తొలి వికెట్‌తో బుమ్రా(1-15) గుజరాత్ పతనాన్ని మొదలెట్టగా కుర్రాడు అశ్వన్ వికెట్ల వేటతో ముంబైని గెలిపించాడు. 200 పరుగుల ఛేదనలో పరిమితమైన గుజరాత్‌కు సొంత ప్రేక్షకుల సమక్షంలో భారీ ఓటమి చవిచూసింది.

వెంకట్రామిరెడ్డిని తొలగించిన ప్రభుత్వం.. మాజీ అధ్యక్షుడు స్పందన ఇదే!

తనను ఉద్యోగం నుండి డిస్మిస్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంకట్రామిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా, కక్షపూరితంగా ఈ చర్య తీసుకుందని ఆయన ఆరోపించారు. 2014-19 మధ్య కాలంలో కూడా పలువురు ప్రభుత్వ ఉద్యోగులు అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారని, కానీ వారిపై ఇలాంటి డిస్మిస్ చర్యలు ఎప్పుడూ తీసుకోలేదని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. కేవలం ఉద్యోగులు ఎవరూ నోరు మెదపకూడదనే భయం సృష్టించేందుకే ప్రభుత్వం ఈ వేటు వేసిందని విమర్శించారు. ప్రభుత్వం జారీ […]

తితిదే డాలర్లకు అక్షయ తృతీయ డిమాండ్‌.. రూ.1.10 కోట్ల విలువైన కొనుగోళ్లు

అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న తితిదే బంగారు, వెండి, రాగి డాలర్ల విక్రయ కేంద్రంలో భక్తులు భారీగా కొనుగోళ్లు జరిపారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు అక్షయ తృతీయ గడియలు ఉండటంతో భక్తులు వరుసకట్టారు. ఆదివారం రూ.70 లక్షలు, సోమవారం రూ. 40 లక్షల విలువైన డాలర్లను కొనుగోలు చేశారు. గత సంవత్సరం దాదాపు రూ.90 లక్షల విలువైన డాలర్లను కొనుగోలు చేశారు. ఈ ఏడాది బంగారం […]

కేజ్రీవాల్‌కు గట్టి దెబ్బ.. రీక్యూసల్ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జస్టిస్ స్వరణ్‌ కాంత శర్మను విచారణను నుంచి తప్పించాలన్న కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్టు జస్టిస్ స్వరణ్‌కాంత్ శర్మ స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం అనుమానాల ఆధారంగా న్యాయమూర్తి సమగ్రతను సవాలు చేయడం తగదని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు, రాజకీయ నాయకులు బహిరంగంగా చేసే వ్యాఖ్యలు కోర్టు నిర్ణయాలను ప్రభావితం చేయలేవని, వాటిని సాక్ష్యాలుగా పరిగణించలేమని జస్టిస్ స్వరణ్ కాంత్ […]

పవన్ కళ్యాణ్ కోసం మృత్యుంజయ హామం.. రాష్ట్రంలో పలుచోట్ల పూజలు..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. పలుచోట్ల జనసేన కార్యకర్తలు, నేతలు మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ నేతృత్వంలో మంగళవారం ఉదయం మోపిదేవి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయంలో మృత్యుంజయ హోమం నిర్వహించనున్నారు. పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి ప్రజా పరిపాలనలో పాల్గొనాలని ఆకాంక్షిస్తూ నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక […]

కేసీఆర్‌.. నువ్వో.. నేనో తేల్చుకుందాం: రేవంత్‌రెడ్డి

రైతు ఉత్సవాల బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. సభావేదిక పైనుంచి రెండోవిడత రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన పోవాలి.. పాపాల భైరవుడు రావాలి అని ఒక పెద్దమనిషి అంటున్నారు పాపాల భైరవుడు ఎందుకు రావాలో.. పార్టీ మారుతున్న పెద్దమనిషి చెప్పాలి..ఒక్కాయనకు పదవి రాకపోతే.. ప్రజాప్రభుత్వం పోవాలా? కేసీఆర్.. నీ ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా. కార్యకర్తల సాక్షిగా ఇదే నా సవాల్. 2029లో నువ్వో.. నేనో తేల్చుకుందాం” అని […]

మళ్లీ తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం చేయాల్సిందే.. కేసీఆర్ పిలుపు

కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ అధినేత విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా లేకపోగా.. కూల్చివేతలు, కాల్చివేతలు, పోలీసుల దాడులు, ఎదురు మాట్లాడితే వారిని పట్టుకుపోవడమే ఉందని విమర్శించారు.  ఈ సందర్భంలో ప్రజల మంచిని కోరే ప్రతి ఒక్కరూ ఒక్కటి కావాల్సిందేనని పిలుపునిచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్లీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. దాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. పోరాటం చేయాల్సిందేనని.. వాళ్లను నిలదీయాల్సిందేనని అన్నారు.  తెలంగాణ ప్రజలు గెలిచి నిలవాల్సిందేనని స్పష్టం చేశారు.

బిడ్డ, కొడుకు, తండ్రి.. తలో ఫామ్‌హౌస్‌: రేవంత్‌రెడ్డి

వరి వేస్తే.. ఉరే అని చెప్పి పంట కొనేది లేదన్న నేత మళ్లీ రావాలా అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘వాస్తు బాగా లేదని బాగున్న సచివాలయం కూల్చి కొత్తగా కట్టుకున్నారు. బిడ్డ, కొడుకు, తండ్రి.. ఇలా తలో ఫామ్‌హౌస్‌ కట్టుకున్నారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే ఆలోచన మాత్రం వాళ్లకు ఏనాడూ రాలేదు. దొరల గడీల ముందు పేదలు ఊడిగం చేస్తూ […]

హైడ్రాను పీకి చెరువులో పడేస్తాం.. జగిత్యాల సభలో కేసీఆర్

గ్రామ పంచాయతీలను నాశనం పట్టించారని.. మున్సిపాలిటీలను మురికి కూపం పట్టించారని కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. మరి ఏం సక్కగుందని ప్రశ్నించారు. ఈ అందానికి బోడి ముండ హైడ్రాను తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో హైడ్రా ఉందని.. మీకేం కావాలి.. పేదోళ్ల కొంపలు కూల్చడమేనా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది ఖాయమని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజుల్లోనే హైడ్రాను ఎత్తి అవతల పడేస్తామని హామీ ఇచ్చారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON