ఇరాన్ నాయకత్వంలో అంతర్యుద్ధం మొదలైనట్లు కనిపిస్తోంది. అయతొల్లా ఖమేనీ మరణం తర్వాత ఆ దేశానికి నాయకత్వ సమస్య వేధిస్తుంది. ఇప్పుడు ఇరాన్‌ను నడిపిస్తున్న వారి మధ్య విబేధాలు కూడా మొదలయ్యాయి.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని తొలగించాలని ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగర్ ఘలిబాఫ్ కోరుతున్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా.. ఇరాన్ అధ్యక్షుడు, ఇతర నేతల్ని సంప్రదించడం లేదు. అలాగే, ఇరాన్ సైనిక సంస్థ అయిన ఐఆర్‌జీసీతో సన్నిహితంగా ఉంటున్నారు.

