ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. పలుచోట్ల జనసేన కార్యకర్తలు, నేతలు మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ నేతృత్వంలో మంగళవారం ఉదయం మోపిదేవి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయంలో మృత్యుంజయ హోమం నిర్వహించనున్నారు. పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి ప్రజా పరిపాలనలో పాల్గొనాలని ఆకాంక్షిస్తూ నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

