కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ అధినేత విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా లేకపోగా.. కూల్చివేతలు, కాల్చివేతలు, పోలీసుల దాడులు, ఎదురు మాట్లాడితే వారిని పట్టుకుపోవడమే ఉందని విమర్శించారు. ఈ సందర్భంలో ప్రజల మంచిని కోరే ప్రతి ఒక్కరూ ఒక్కటి కావాల్సిందేనని పిలుపునిచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్లీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. దాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. పోరాటం చేయాల్సిందేనని.. వాళ్లను నిలదీయాల్సిందేనని అన్నారు. తెలంగాణ ప్రజలు గెలిచి నిలవాల్సిందేనని స్పష్టం చేశారు.

