loader

ఎగబడుతున్న జనం.. దేశవ్యాప్తంగా గోల్డ్ సునామీ!

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా ప్రకారం, ఈ ఏడాది అక్షయ తృతీయ వ్యాపారం రూ. 20,000 కోట్ల మార్కును తాకనుంది. గత ఏడాది ఇది రూ. 16,000 కోట్లుగా ఉండగా, ఈసారి భారీ పెరుగుదల కనిపిస్తోంది. బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ, ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ వల్ల విక్రయాలు ఏమాత్రం తగ్గడం లేదు. వ్యాపారులు కూడా ఈ డిమాండ్‌ను తట్టుకోవడానికి భారీగా సిద్ధమయ్యారు. ధరల భారం పెరగడంతో వ్యాపారులు కూడా ప్రతిరోజూ ధరించేలా […]

తెనాలిలో అశ్లీల కాల్స్, చాటింగ్ దందా షురూ చేశారా..?

అశ్లీల కాల్స్, చాటింగ్ కలకలం తెనాలిలో బయటపడింది. ఆన్‌లైన్‌లో ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసి..bమహిళలతో అశ్లీల చాటింగ్, వీడియో కాల్స్ నిర్వహిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇద్దరు మహిళలను గుర్తించిన పోలీసులు.. అసలు సూత్రధారి ఒక యువకుడని తేల్చారు. తెనాలి చెంచుపేట, పాండురంగపురం ప్రాంతాల్లో నివసించే మధ్య వయస్కులైన మహిళలు ఈ ఆన్‌లైన్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు పోలీసులు గుర్తించారు. “స్ట్రిప్ టాక్” పేరుతో నడుస్తున్న ఈ పోర్టల్‌కు ఎక్కడి నుంచైనా కనెక్ట్ అయ్యే వీలుండేది.

పవన్ కోలుకుంటున్నారు – భార్య అన్నా పోస్ట్…

పవన్ కళ్యాణ్ హెల్త్ అప్డేట్, రికవరీ గురించి ఆయన శ్రీమతి అన్నా కొణిదెల పోస్ట్ వేశారు. ”ఆయన త్వరగా కోరుకుంటున్నారు… ఆల్ ఈజ్ వెల్! మీరు చూపిస్తున్న ప్రేమ, ఆయన కోసం చేస్తున్న ప్రార్థనలకు ధన్యవాదాలు” అని అన్నా కొణిదెల పోస్ట్ వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ  యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాను. ఆయన ఎంతో ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అతి త్వరలోనే కోలుకుంటారని నమ్ముతూ ఆయన సంపూర్ణ ఆరోగ్యం కోసం […]

అగార్కర్ పదవీకాలం పొడిగింపు.. వరుస ఐసీసీ టైటిళ్లే కారణమా?

భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన సెలెక్షన్ కమిటీలలో ఒకటిగా గుర్తింపు పొందిన అజిత్ అగార్కర్ బృందానికి BCCI మరోసారి పట్టం కట్టనుంది. ప్రస్తుతం ఉన్న ఒప్పందం ప్రకారం అగార్కర్ పదవీకాలం 2026 జూన్‌తో ముగియాల్సి ఉంది. అయితే, వచ్చే ఏడాది జరగనున్న 2027 ఐసీసీ వన్డే ప్రపంచ కప్ వరకు ఆయనే చీఫ్ సెలెక్టర్‌గా కొనసాగాలని బోర్డు మొగ్గు చూపుతోంది. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన, సుదీర్ఘ కాలం కొనసాగిన చీఫ్ సెలెక్టర్లలో ఒకరిగా […]

ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు సెలవులు

రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు మరో మూడు రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం, ఏప్రిల్ 23వ తేదీని ఈ ఏడాదికి చివరి పని దినంగా నిర్ణయించారు. . ఈ సెలవులు జూన్ 11 వరకు కొనసాగుతాయి. తిరిగి జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమై, కొత్త విద్యా సంవత్సరం (2026-27) మొదలవుతుంది

అమెరికాలో రోజా కూతురు.. అన్షుకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు..

మాజీ మంత్రి ఆర్‌కే రోజా కూతురు అన్షు మాలిక మరో అరుదైన గౌరవం అందుకుంది. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ఇండియానా యూనివర్సిటీ ఏటా ఒక్కరికి మాత్రమే ప్రదానం చేసే హెర్మన్ బి వెల్స్ అవార్డుకు అన్షు ఎంపికైంది. ఈ విషయాన్ని రోజానే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. 1961 నుంచి ఇండియానా యూనివర్సిటీ ప్రతి సంవత్సరం ఒక అత్యుత్తమ విద్యార్థికి ఈ ప్రతిష్టాత్మకం ఈ పురస్కారం అందిస్తోంది.చదువుతో పాటు లీడర్ షిప్, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా […]

హయత్ నగర్ లో రంగనాథ స్వామి దేవాలయంలో దొంగల భీభత్సం

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలంలో రంగనాథ స్వామి దేవాలయంలో దొంగల భీభత్సం సృష్టించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సొంత గ్రామం తోర్రుర్‌లో రంగనాయకుల గుట్ట దేవాలయంలో హుండీ దొంగతనం జరిగింది. హయత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఈ దేవాలయంలో ఇప్పటి వరకు మూడు సార్లు దొంగతనం జరిగింది. రంగనాథ స్వామి ఆలయ ప్రధాన ద్వారం పగలగొట్టి రెండు హుండీలను దుండగులు ఎత్తుకొని వెళ్లారు. భక్తులతో పాటు స్థానికులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం […]

పవన్ కళ్యాణ్ సర్జరీపై స్పందించిన జగన్- ఎమోషనల్ మెసేజ్..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనకు డాక్టర్లు సర్జరీ నిర్వహించారు ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించి ఓ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారూ.. మీరు శస్త్రచికిత్స తర్వాత వేగంగా, పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ వైఎస్ జగన్ ఇవాళ ట్వీట్ చేశారు. గెట్ వెల్ సూన్ అంటూ తెలిపారు

తమిళనాడులో చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం

నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) కూటమి విజయాన్ని కాంక్షిస్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తమిళ గడ్డపై సుడిగాలి పర్యటన చేయనున్నారు. పర్యటనలో భాగంగా మొదటి రోజు కోయంబత్తూర్, హోసూర్, చెన్నై,రెండవ రోజున మదురై ,శాత్తూరు నగరాల్లో పర్యటించి, కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించనున్నారు.

తల్లికి క్యాన్సర్ అని.. ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసిన కేటుగాడు,బట్టబయలు చేసిన ప్రియురాలు

తన తల్లికి సర్వైకల్ క్యాన్సర్, కిడ్నీ సమస్యలు ఉన్నట్లు జయమ్మ అనే ప్రభుత్వ ఉద్యోగి కొడుకు చక్రపాణి నకిలీ సర్టిఫికేట్లు సృష్టించాడు. కర్నూలు మెడికల్ బోర్డు పరీక్షల సమయంలో తన తల్లికి బదులుగా మరో మహిళను పంపి అనారోగ్య ధ్రువీకరణ పొంది ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం పొందాడు. అయితే.. చక్రపాణికి అతని ప్రియురాలితో విభేదాలు రావడంతో ఈ వ్యవహారం మలుపు తిరిగింది. అతను తల్లి ఉద్యోగం కోసం చేసిన అక్రమాలన్నింటినీ ఆధారాలతో సహా సేకరించిన […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON