తన తల్లికి సర్వైకల్ క్యాన్సర్, కిడ్నీ సమస్యలు ఉన్నట్లు జయమ్మ అనే ప్రభుత్వ ఉద్యోగి కొడుకు చక్రపాణి నకిలీ సర్టిఫికేట్లు సృష్టించాడు. కర్నూలు మెడికల్ బోర్డు పరీక్షల సమయంలో తన తల్లికి బదులుగా మరో మహిళను పంపి అనారోగ్య ధ్రువీకరణ పొంది ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం పొందాడు. అయితే.. చక్రపాణికి
అతని ప్రియురాలితో విభేదాలు రావడంతో ఈ వ్యవహారం మలుపు తిరిగింది.
అతను తల్లి ఉద్యోగం కోసం చేసిన అక్రమాలన్నింటినీ ఆధారాలతో
సహా సేకరించిన ఆమె.. అతని అసలు బండారాన్ని బయటపెట్టింది.

