భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై స్పందించారు. పవన్ కళ్యాణ్ సర్జరీ అనంతరం కోలుకుంటున్న క్రమంలో ప్రధాని మోదీ ఆయనతో స్వయంగా మాట్లాడి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. సర్జరీ చేయించుకున్న పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

