శ్రీరామచంద్రుని మీద చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ఓ వీడియో విడుదల చేశారు. తన మాటల్ని వక్రీకరించారని చెప్పిన ప్రకాష్ రాజ్… అన్ని ధర్మాలను, అందరినీ ప్రేమించే తనకు రాముడిని వెటకారం చేసే అవసరం అయితే లేదని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ… ”ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డు పెట్టుకుని అసహ్యమైన రాజకీయం చేస్తున్న వాళ్ళను నేను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక కొందరు నన్ను యాంటీ హిందూ, హిందూ ధర్మ విరోధి అని నిందించడానికి ప్రయత్నిస్తున్నారు. సో… వాళ్లకు సమాధానం చెప్పాలి. త్వరలో వస్తాను.

