రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలంలో రంగనాథ స్వామి దేవాలయంలో దొంగల భీభత్సం సృష్టించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సొంత గ్రామం తోర్రుర్‌లో రంగనాయకుల గుట్ట దేవాలయంలో హుండీ దొంగతనం జరిగింది. హయత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఈ దేవాలయంలో ఇప్పటి వరకు మూడు సార్లు దొంగతనం జరిగింది. రంగనాథ స్వామి ఆలయ ప్రధాన ద్వారం పగలగొట్టి రెండు హుండీలను దుండగులు ఎత్తుకొని వెళ్లారు. భక్తులతో పాటు స్థానికులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొంగలను పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

