loader

జపాన్‌లో భూకంపం.. సునామీ హెచ్చరికలు

జపాన్ ఉత్తర తీరంలో శక్తిమంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.4గా నమోదైంది. సాన్రకు తీరానికి దూరంగా సముద్ర ఉపరితలానికి దాదాపు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. ఈ క్రమంలోనే జపాన్ వాతావరణ సంస్థ.. సునామీ హెచ్చరికలు జారీ చేసింది. మూడు మీటర్ల ఎత్తువరకు అలలు విరుచుకుపడే అవకాశం ఉందని హెచ్చరించింది.

నుదిటిన విభూది, తెల్లచీరలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్..

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌, పలు సినిమాల్లో యాక్ట్ చేసిన పూనమ్ కౌర్ వేములవాడలోని శ్రీపార్వతీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం అక్షయ తృతీయ సందర్భంగా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఒకప్పటి నటి. స్వామివారి కరుణ కటాక్షాలు టెక్స్‌టైల్ రంగంతోపాటు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు. పెద్ద పెద్ద వాళ్లు వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకోవాలని సూచించిన నేపథ్యంలో నేడు స్వామివారిని దర్శించుకుని కోడె మొక్కులు చెల్లించుకున్నట్లు చెప్పారు హీరోయిన్ పూనమ్ కౌర్. 

తెలంగాణపై వరుణుడి పంజా: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన!

తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం నుండి రాత్రి వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఆకాశం మేఘావృతమై ఉండి, అకస్మాత్తుగా వర్షం మొదలయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ మరియు మేడ్చల్ జిల్లాల్లో వర్ష సూచన ఉంది.

హీరో విజయ్ విడాకుల కేసు..వీడియో కాన్ఫరెన్స్‌కు నో చెప్పిన కోర్టు

హీరో విజయ్ భార్య సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌పై సోమవారం చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అత్యంత బిజీగా ఉన్నారని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.అయితే,. ఇద్దరు వ్యక్తులు విడిపోయే సందర్భంలో వారిని నేరుగా సంప్రదించడం ముఖ్యం అని భావించిన న్యాయస్థానం, జూన్ 15న విజయ్ మరియు సంగీత ఇద్దరూ భౌతికంగాకోర్టుకు హాజరుకావాలని స్పష్టం చేసింది.

అక్రమసంబంధం పెట్టుకోవాలని వివాహితను బెదిరించిన ప్రజాప్రతినిధి

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో కంచర్ల గ్రామంలో ఉప సర్పంచ్ ఓ వివాహితను అక్రమ సంబంధం పెట్టుకోవాలని పలుమార్లు బెదిరించాడు. డబ్బులు, నగలు ఆశ చూపి వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వివాహితపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఐదు సంవత్సరాల పాటు పదవిలో ఉంటానని తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని, లేకపోతే టార్చర్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఈ విషయం ఆమె తన భర్తకు చెప్పడంతో అతడు వాటర్ ట్యాంక్ ఎక్కి సూసైడ్ చేసుకుంటానని బెదిరించాడు. కేసు నమోదు చేసి […]

ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు: అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్ డ్రోన్ల దాడి

ఒమన్ గల్ఫ్‌లో ఇరాన్ వాణిజ్య నౌకపై అమెరికా సైన్యం జరిపిన దాడికి ప్రతిస్పందనగా, ఆ ప్రాంతంలో పనిచేస్తున్న అమెరికా బలగాలపై ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్స్ కార్ప్స్ (IRGC) డ్రోన్‌లను ప్రయోగించిందని స్థానిక మీడియా సోమవారం నివేదించింది. ఒమన్ గల్ఫ్‌లో అమెరికా దళాలు ఒక ఇరాన్ నౌకను లక్ష్యంగా చేసుకున్నాయని స్థానిక మీడియా తెలిపింది. అయితే, ఐఆర్‌జిసి నావికా దళాల “సకాలంలో రాక, వేగవంతమైన ప్రతిస్పందన” కారణంగా అమెరికా దళాలు వెనుదిరగవలసి వచ్చిందని అది పేర్కొంది.

ప్రైవేట్ వీడియోలతో బాలికలు, యువతుల్ని బ్లాక్ మెయిల్.. లక్షలు వసూలు

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ ప్రస్తుతం హైదరాబాద్ లో వుంటూ ఖరీదైన కార్లు, పబ్‌లలో దిగిన ఫొటోలను చూపిస్తూ తాను రిచ్ ఫ్యామిలీకి చెందినవాడినని నమ్మించి చాటింగ్ ద్వారా ప్రేమ పేరుతో లోబరుచుకుని వారితో ఏకాంతంగా గడిపిన వీడియోలు, ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజుతున్నట్లు గుర్తించారు. గడిచిన రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 20 మందికి పైగా యువతులను అర్జున్ మోసం చేసినట్లు తెలుస్తోంది. బాధిత యువతుల […]

పోలీస్ స్టేషన్ లో తుపాకీతో కాల్చుకున్న కానిస్టేబుల్

తుపాకీతో కాల్చుకొని ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలో జరిగింది. ధనరాజు అనే కానిస్టేబుల్ కాకినాడ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్నాడు. విధులు నిర్వహిస్తుండగా రైఫిల్‌తో కానిస్టేబుల్ కాల్చుకున్నాడు. తోటి సిబ్బంది అతడు తీవ్రంగా గాయపడడంతో కాకినాడ జిజిహెచ్‌కి తరలించారు. అతడి పరిస్థితి నిలకడగానే ఉందన్న వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇరాన్‌లో ఐఆర్‌జీసీ ఆధిపత్యం: మితవాద దౌత్యానికి చెక్!

ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. ఇరాన్ విదేశాంగ విధానాన్ని శాసించే మితవాద నాయకులను పక్కకు నెట్టి, అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకునే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) పట్టు సాధించింది. IRGC కమాండర్-ఇన్-చీఫ్ అహ్మద్ వాహిది, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మహ్మద్ బాఘర్ జోల్ఘాదర్ మరియు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ హుస్సేన్ తాబ్ కలిసి ఒక శక్తివంతమైన వర్గంగా ఏర్పడ్డారు. వీరు మితవాద విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రభావాన్ని […]

భారీ భూ కుంభకోణం..సంధ్యా కన్‌స్ట్రక్షన్స్ యజమాని..భార్యపై కేసు

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో భారీ మోసం వెలుగుచూసింది. నగరంలోని వివాదాస్పద భూములను అమ్ముతామని నమ్మించి, ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ సంస్థను రూ.14.85 కోట్లకు ముంచిన ఆరోపణలపై సంధ్యా కన్‌స్ట్రక్షన్స్ యజమాని శరణాల శ్రీధర్ రావు, ఆయన భార్య సంధ్యలపై సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (EOW) కేసు నమోదు చేసింది. తమ డబ్బు తిరిగి ఇవ్వమని కోరినందుకు నిందితులు బెదిరింపులకు కూడా పాల్పడినట్లు సమాచారం. గతంలో కూడా శ్రీధర్ రావుపై పలు క్రిమినల్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON