loader

జూనియర్ ఎన్టీఆర్‌ను తిట్టినట్టుగా ఆడియో వైరల్… టీడీపీ ఎమ్మెల్యే ఆఫీసును ముట్టడించిన ఫ్యాన్స్

జూనియర్ ఎన్టీఆర్‌ను తిట్టినట్టుగా ఆడియో వైరల్‌గా మారడంతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌పై ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దగ్గుబాటి ప్రసాద్ బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు అక్కడి ఫ్లెక్సీలను చించివేశారు. పరిస్థితి చేజారకుండా పోలీసులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను అడ్డుకున్నారు.

జూనియర్ ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. టీడీపీ ఎమ్మెల్యేదే అంటూ ఆడియో వైరల్

జూనియర్ ఎన్టీఆర్‌‌‌పై పరుష పదజాలంతో మాట్లాడుతోన్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యేది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. తనను స్పెషల్ షోకు ఆహ్వానించిన అభిమానితో బూతులు మాట్లాడుతున్న వ్యక్తి.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌పై అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేయడం ఆడియోలో వినిపిస్తోంది. నారా లోకేష్‌కు వ్యతిరేకంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వను.. సినిమాను ప్రదర్శిస్తే మధ్యలోనే కాల్చేస్తా.. ఆడించుకోండి చూద్దాం’’ అంటూ అతడికి హెచ్చరించడం ఆడియాలో […]

ఈ శుభాకాంక్షలు అందుకోవడం నాకు నిజమైన గౌరవం-రజినీకాంత్

సినీ రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌కి రజినీకాంత్ స్పందిస్తూ.. ‘నేను ఎప్పటినుంచో అత్యంత గౌరవంగా భావించే నాయకుడి నుంచి ఈ శుభాకాంక్షలు అందుకోవడం నాకు నిజమైన గౌరవం. మీ ప్రేమ, ఆప్యాయతకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.. జైహింద్’ అని ట్వీట్ చేశారు.

రజినీకాంత్ ‘కూలీ’ విజయ విహారం.. ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన మోదీ

రజినీకాంత్ సినీ కెరీర్‌కు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ‘కూలీ’ రిలీజ్ కావడం, అది ఘనవిజయం సాధించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తూ, “చలనచిత్ర ప్రపంచంలో 50 అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజినీకాంత్‌గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన పాత్రలు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసాయి. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను,” అన్నారు.

మహావతార్‌ నరసింహ సినిమాను చూసిన చాగంటి కోటేశ్వరరావు.. ఏమన్నారంటే?

సంచలనం సృష్టించిన చిత్రం మహావతార్ నరసింహ. ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు ఈ సినిమాను చూశారు. ‘మన పురాణాలకు చాలా దగ్గరగా మహావతార్‌ నరసింహ సినిమా ఉంది. నరసింహ స్వామి.. హిరణ్యాక్షుడి పురాణ కథను మనుషులతో కాకుండా బొమ్మలతో తీసినప్పటికి సహజంగా..కనువిందుగా..నిజంగా దైవిక అనుభవాన్ని అందించేలా తెరకె్కించారు. ముఖ్యంగా చివరి సన్నివేషం చాలా అద్భుతంగా ఉంది. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూడొచ్చు’ అని చాగంటి చెప్పుకొచ్చారు.

కూతురితో కలిసి రామ్ చరణ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్

దేశం మొత్తం 79వ ఇండిపెండెన్స్ డేను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా సినీతారలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కూతురు క్లింకారతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. తన ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేశారు. మరోవైపు తన ఛారిటబుల్ ట్రస్టులో మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్ తో కలిసి మువ్వన్నెలా జెండా ఎగురవేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

దర్శన్, పవిత్ర గౌడ అరెస్ట్

రేణుకాస్వామి అనే వ్యక్తి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్, హీరోయిన్ పవిత్ర గౌడలకు సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. వారిద్దరిని వెంటనే అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించడంతో బెంగళూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. కొద్ది గంటల్లోనే పవిత్ర గౌడని, దర్శన్‌ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో వారిద్దరు ప్రస్తుతం బెయిల్‌పై బయటకు ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి తీవ్రమైన కేసుల్లో నిందితులకు బెయిల్ ఇవ్వడం మంచిది కాదని అభిప్రాయపడుతూ సుప్రీంకోర్టు వారి […]

నటుడు దర్శన్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు.. బెయిల్ రద్దు

కన్నడ నటుడు దర్శన్‌కు మరోసారి బిగ్ షాక్ తగిలింది. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన దర్శన్‌కు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ క్రమంలోనే రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌కు.. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పును రద్దు చేస్తున్నట్లు తాజాగా సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. చట్టం ముందు అందరూ సమానులేనని.. ఎవరూ అతీతులు కాదని తేల్చి చెప్పారు. దర్శన్‌ను తొందరగా అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

రూ. 60 కోట్ల స్కామ్‌లో..శిల్పా శెట్టి దంప‌తులు..!

బాలీవుడ్ స్టార్ బ్యూటీ శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా మరో వివాదంలో చిక్కుకుని హెడ్ లైన్స్ లో నిలిచారు. ముంబైకి చెందిన వ్యాపార‌వేత్త‌, లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ దీపక్ కొఠారీ శిల్పా శెట్టి దంప‌తులపై ఫిర్యాదు చేశాడు. 2015 – 2023 మ‌ధ్య వ్యాపార విస్తరణ పేరుతో త‌న వద్ద నుంచి రూ. 60.48 కోట్లు తీసుకున్నార‌ని.. అయితే ఆ నిధులను వారు తమ సొంత ఖర్చులకు వాడుకున్నారని దీపక్ కొఠారీ […]

రెండు మూడు సార్లు చర్చలు జరగాల్సి ఉంది : సినీ కార్మికుల వేతన పెంపుపై దిల్‌ రాజు

తాజాగా సినీ కార్మికుల వేతన పెంపు విషయంపై నిర్మాతలు, ఫెడరేషన్‌ నాయకుల మధ్య చర్చలు ముగిశాయి. అయితే ఈ చర్చలు విఫలమైనట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దిల్‌ రాజు మాట్లాడుతూ.. సినీ కార్మికుల వేతనాల అంశం ఇంకా కొలిక్కి రాలేదన్నారు. మరో రెండు మూడు సార్లు ఈ అంశంపై చర్చలు జరగాల్సి ఉందన్నారు. ఆ తర్వాత సమస్య పరిష్కారమయ్యే అవకాశమున్నట్టు చెప్పారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON