బాలీవుడ్ స్టార్ బ్యూటీ శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా మరో వివాదంలో చిక్కుకుని హెడ్ లైన్స్ లో నిలిచారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త, లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ దీపక్ కొఠారీ శిల్పా శెట్టి దంపతులపై ఫిర్యాదు చేశాడు. 2015 – 2023 మధ్య వ్యాపార విస్తరణ పేరుతో తన వద్ద నుంచి రూ. 60.48 కోట్లు తీసుకున్నారని.. అయితే ఆ నిధులను వారు తమ సొంత ఖర్చులకు వాడుకున్నారని దీపక్ కొఠారీ ఆరోపణలు చేశారు.

