జూనియర్ ఎన్టీఆర్‌పై పరుష పదజాలంతో మాట్లాడుతోన్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యేది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. తనను స్పెషల్ షోకు ఆహ్వానించిన అభిమానితో బూతులు మాట్లాడుతున్న వ్యక్తి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేయడం ఆడియోలో వినిపిస్తోంది. నారా లోకేష్‌కు వ్యతిరేకంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వను..
సినిమాను ప్రదర్శిస్తే మధ్యలోనే కాల్చేస్తా.. ఆడించుకోండి చూద్దాం’’ అంటూ అతడికి హెచ్చరించడం ఆడియాలో స్పష్టంగా వినిపిస్తోంది

