విద్యార్థులకు అక్కినేని నాగార్జున భారీ కానుక – రూ.2 కోట్లు విరాళం
గుడివాడ ఏఎన్నార్ కాలేజీ విద్యార్థులకు కింగ్ నాగార్జున పేద విద్యార్థులను చదువులో ప్రోత్సహించేందుకు అక్కినేని కుటుంబం తరఫున కాలేజీలో స్కాలర్‌షిప్‌ల ఏర్పాటు కోసం ఏకంగా రూ. 2 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. గుడివాడలోని ఏఎన్నార్ కాలేజీలో జరుగుతున్న డైమండ్ జూబ్లీ (వజ్రోత్సవ) వేడుకలకు నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘నాన్న పెద్దగా చదువుకోలేదు. కానీ ఆయనకు చదువు అంటే ప్రాణం. తాను చదువుకోలేకపోయినా, వేల మంది చదువుకోవాలని ఆయన కోరుకున్నారు అక్కినేని నాగేశ్వరరావుకు చదువుపై ఉన్న […]

