loader

బౌలర్ల కట్టడి.. బ్యాటర్ల మెరుపు.. భారత్ ఘన విజయం

భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కీలకమైన మూడో మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించి సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభం నుంచే భారత బౌలర్ల ధాటికి తడబడింది. అర్ష్‌దీప్ సింగ్ తొలి ఓవర్‌లోనే రీజా హెండ్రిక్స్‌ను అవుట్ చేయగా, విజయం కోసం 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని అందుకునేందుకు బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్లు ధాటిగా ఆడి, ఎలాంటి ఇబ్బంది లేకుండా లక్ష్యాన్ని ఛేదించారు. ఓపెనర్లు శుభ్‌మన్ […]

ఓటు చోరీ బిజెపి డిఎన్‌ఏలోనే ఉంది: రాహుల్ గాంధీ

ఓటు చోరీ అనేది బీజేపీ డిఎన్ ఏలోనే ఉందని , రానున్న ఎన్నికల్లో నరేంద్రమోదీ -ఆర్ ఎస్ ఎస్  ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగిస్తామని కాంగ్రెస్ ప్రతిజ్ఞ చేసినట్లు వెల్లడించారు. రామ్ లీలా మైదానంలో పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఓట్ చోర్ గద్దీ ఛోడ్  ర్యాలీలో రాహుల్ గాంధీ  ఆరోపించారు. ఎన్నికల కమిషన్ పై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ అండ్ కో కు అధికారం ఉందని, అందుకే వారు ఓట్ చోరీలో మునిగి పోయారని ఆయన […]

మెస్ ఇంచార్జ్‌గా ఉండి ఇదేం పనిరా.. కోఠి ఉమెన్స్ కాలేజీలో కలకలం..

కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. విశ్వవిద్యాలయంలో పీజీ చదువుతున్న పలువురు విద్యార్థినులు, తాము నివసిస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ గర్ల్స్‌ హాస్టల్‌లో మెస్‌ ఇంచార్జీగా పనిచేస్తున్న వినోద్‌ తమను మానసికంగా వేధిస్తున్నాడంటూ షీటీమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన విద్యార్థినుల భద్రతపై తీవ్ర ఆందోళనలను కలిగిస్తోంది. మెస్‌ ఇంచార్జీ వినోద్‌ ప్రవర్తన వల్ల హాస్టల్‌లో ఉండాలంటే భయంగా ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆయన వ్యవహారం కారణంగా చదువుపై దృష్టి సారించలేని పరిస్థితి […]

మరణించిన ఉద్యోగికి ఎలక్షన్ డ్యూటీ

మృతి చెందిన ఉద్యోగికి ఎలక్షన్ డ్యూటీ వేసిన సంఘటన నిర్మల్ జిల్లా, కడెం మండలం, పెద్దూర్ తండాలో చోటుచేసుకుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వీలుగా పెద్దూరు తండాకు చెందిన హార్టికల్చర్ ఉద్యోగికి అధికారులు డ్యూటీ వేశారు. దీంతో పలువురు ఒక్కసారి షాక్‌కు గురయ్యారు. గ్రామానికి చెందిన సదరు ఉద్యోగి మరణించాడని, కానీ అతనికి ఎలక్షన్ డ్యూటీ వేయడమేంటని పలువురు ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఓట్‌ చోరీ, ఎస్‌ఐఆర్‌ ద్వారా అక్రమంగా గెలవాలని బీజేపీ చూస్తోంది : సీఎం రేవంత్ రెడ్డి

రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ చూస్తోందని, కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ‘ఓట్‌ చోర్‌-గద్దీ ఛోడ్‌’ పేరుతో దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్‌ పార్టీ మహా ధర్నాలో రేవంత్​ రెడ్డి ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్, గోల్వాల్కర్ భావజాలంతో ఉన్న నరేంద్ర మోదీ, అమిత్ షా కేంద్రంలో భావజాలాన్ని అమలు చేసేందుకు 400 సీట్లు కావాలని కోరుకున్నారని, బీజేపీకి 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు ఎత్తివేస్తారని ఆ పార్టీని 240 […]

పులివెందులలో బీటెక్ రవికి షాక్.. ఇళ్లకు తాళాలు వేసిన గ్రామస్థులు

పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి బీటెక్ రవికి చేదు అనుభవం ఎదురైంది. వేంపల్లి మండలంలో బీటెక్ రవికి నిరసన సెగ తగిలింది. మండలంలోని అమ్మగారిపల్లి గ్రామంలో కొన్ని కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యాయి. దీంతో వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించేందుకు బీటెక్ రవి అక్కడకు వెళ్లారు. అయితే బీటెక్ రవి రాకతో అమ్మగారిపల్లి గ్రామస్తులు.. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లిపోయారు. దీంతో ఈ విషయం ప్రాధాన్యం సంతరించుకుంది.

రెండో విడతలోనూ కాంగ్రెస్​ మద్దతుదారుల హవా – వెయ్యికి పైగా స్థానాల్లో పాగా

తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికల రెండో విడత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు 1928కు పైగా సర్పంచి స్థానాల్లో విజయాలను తమ ఖాతాలో వేసుకున్నారు. భారత రాష్ట్ర సమితి మద్దతుదారులు 1027, బీజేపీ మద్దతుదారులు 219 స్థానాల్లో గెలుపొందారు. 552 స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 85.86 శాతం పోలింగ్ నమోదైంది

ఒకే ఫ్రేమ్‌లో ఫుట్‌బాల్ దిగ్గజాలు.. వాంఖడేను హోరెత్తించిన ఫ్యాన్స్..!

‘గోట్ ఇండియా టూర్ 2025’లో భాగంగా ముంబై మహా నగరంలో లియోనల్ మెస్సీ అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా భారత ఫుట్‌బాల్ గోట్ సునీల్ ఛెత్రీ.. వరల్డ్ స్టార్ మెస్సీని కలిశాడు. ఇద్దరూ సాకర్ దిగ్గజాలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఈలలు, కేకలతో వాంఖడేను హోరెత్తించారు. ఛెత్రికి సంతకం చేసిన తన పదో నంబర్ జెర్సీని కానుకగా ఇచ్చాడు మెస్సీ. అనంతరం సూరెజ్, డిపౌవ్‌లతో కలిసి ఇద్దరూ ఫొటో దిగారు.

లక్కీ డ్రాలో వరించిన సర్పంచ్ పదవి

మెదక్ జిల్లా , మండలంలోని  చీపురుదుబ్బ తండా గ్రామపంచాయతీలో మొత్తం 377 ఓట్లు ఉండగా 367 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి సునీతకు 182 ఓట్లు రాగా బిఆర్ఎస్ అభ్యర్థి బిమిలికి కూడా 182 ఓట్లు వచ్చాయి. మరో రెండు ఓట్లు చెల్లకుండా పోయాయి. ఒక ఓటు నోటా కి పడింది. దీంతో ఇద్దరికి సమానంగా ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు డ్రా తీయగా కాంగ్రెస్ అభ్యర్థి కెతావత్ సునిత విజయం సాధించింది.

బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా.. బీహార్ మంత్రి నితిన్ నబిన్

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బీహార్‌ మంత్రి నితిన్ నబిన్‌ను ఆ పార్టీ నియమించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదివారం జారీ చేసిన అధికారిక ఉత్తర్వులో ఈ విషయాన్ని వెల్లడించారు నితిన్‌ నబిన్ ప్రస్తుతం సీఎం నితీశ్‌ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నారు. ఐదుసార్లు బీహార్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన కాయస్థ వర్గానికి చెందినవారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON