ఓటు చోరీ అనేది బీజేపీ డిఎన్ ఏలోనే ఉందని , రానున్న ఎన్నికల్లో నరేంద్రమోదీ -ఆర్ ఎస్ ఎస్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగిస్తామని కాంగ్రెస్ ప్రతిజ్ఞ చేసినట్లు వెల్లడించారు. రామ్ లీలా మైదానంలో పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఓట్ చోర్ గద్దీ ఛోడ్ ర్యాలీలో రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల కమిషన్ పై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ అండ్ కో కు అధికారం ఉందని, అందుకే వారు ఓట్ చోరీలో మునిగి పోయారని ఆయన ఆరోపించారు.

