తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్. కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం తిరుమలకు చేరుకున్న రజినీ..శనివారం విఐపి బ్రేక్ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. రజినీకాంత్ భార్య లతా, కూతుళ్లు ఐశ్వర్య, సౌందర్య, మనవళ్లు లింగ రాజా, యాత్ర రాజాతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా శ్రీవారి తీర్థ ప్రసాదాలను ప్రజలకు ఈఓ వెంకయ్య చౌదరి అందజేశారు.

