loader

మళ్లీ నష్టాల బాటలోకి.. సెన్సెక్స్ 500 పాయింట్లు డౌన్..

భారీ నష్టాల నుంచి కోలుకుని మంగళవారం లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు బుధవారం మళ్లీ నష్టాల బాట పట్టాయి. బుధవారం ఉదయం దాదాపు ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. ప్రస్తుతం ఉదయం 10:15 గంటల సమయంలో సెన్సెక్స్ 502 పాయింట్ల నష్టంతో 77,745 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 136 పాయింట్ల నష్టంతో 24,125 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం […]

నష్టాల నుంచి ఉపశమనం.. కోలుకుంటున్న దేశీయ సూచీలు..

పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల కారణంగా సోమవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు మంగళవారం కాస్త కోలుకున్నాయి. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ఒత్తిడి తగ్గించేందుకు కొన్ని ఆంక్షలను సడలిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం సానుకూలంగా మారింది. ప్రస్తుతం ఉదయం 10:15 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్ల లాభంతో 78,100 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 166 పాయింట్ల లాభంతో 24,183 వద్ద కదలాడుతోంది

10 నిమిషాల్లోనే రూ.12 లక్షల కోట్లు లాస్.. కుప్పకూలిన మార్కెట్లు.. సెన్సెక్స్ 2400 డౌన్

ఇండియన్ స్టాక్ మార్కెట్లు సోమవారం రోజు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు 3 శాతం మేర పడిపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలోని నమోదిత కంపెనీల మార్కెట్ విలువ ఆరంభంలోనే భారీ అమ్మకాలతో ఏకంగా రూ.12.39 లక్షల కోట్లు ఆవిరైపోయింది. కేవలం 10 నిమిషాల్లోని మొత్తం కంపెనీల విలువ భారీగా కోసుకుపోయి రూ.437 లక్షల కోట్లకు దిగివచ్చింది. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 100 డాలర్లు దాటింది. అలాగే భారతీయ రూపాయి మారకం విలువ సైతం తగ్గడం మార్కెట్లపై […]

బంగారం ధరలు స్థిరం, హైదరాబాద్‌లో ఈరోజు రేట్లు ఇవే

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం: 10 గ్రాములకు రూ. 1,50,000, 24 క్యారెట్ల బంగారం: 10 గ్రాములకు రూ. 1,63,640, వెండి ధరలో కూడా ఈరోజు పెద్ద మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,90,000 వద్ద ట్రేడవుతోంది

ఫ్లిప్ కార్ట్ లో ఉద్యోగాల కోత 300 మందికి లేఆఫ్

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో ఉద్యోగుల కోతలు చర్చనీయాంశంగా మారాయి వార్షిక పనితీరు సమీక్షలో భాగంగా సుమారు 250 నుంచి 300 మంది ఉద్యోగులను కంపెనీ విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. ఈ విషయంపై ఫ్లిప్ కార్ట్ యాజమాన్యం స్పందిస్తూ ఉద్యోగుల పనితీరును క్రమం తప్పకుండా సమీక్షించడం సంస్థలో సాధారణ ప్రక్రియ అని తెలిపింది నిర్దేశిత ప్రమాణాలను అందుకోలేకపోయిన కొద్ది శాతం మంది ఉద్యోగులు సంస్థ నుంచి వైదొలగాల్సి వస్తుందని పేర్కొంది

వార్​ ఎఫెక్ట్- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు- సెన్సెక్స్ 1700 పాయింట్లు డౌన్

పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం భారత స్టాక్‌ మార్కెట్‌పై భారీగా పడింది. బుధవారం దేశీయ మార్కెట్​ సూచీలు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియా ఉద్రిక్తత ప్రభావం ఎలా ఉంటుందో అనే భయంతో మదుపర్లు జాగ్రత్త పడుతున్నారు. ఎర్లీ ట్రేడింగ్​లో సెన్సెక్స్‌ 1,700 పాయింట్లకి పైగా పడిపోయి 78,550 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 500 పాయింట్లకి పైగా కోల్పోయి 24,340 స్థాయికి చేరింది. ఆ తర్వాత సెన్సెక్స్​ 1400 పాయింట్ల పైగా తగ్గగా, నిఫ్టి […]

మరింత దిగజారిన రూపాయి విలువ! డాలర్‌తో పోలిస్తే ఇప్పుడు

సోమవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ 21 పైసలు తగ్గి 91.29కి చేరుకుంది. ముడి చమురు ధరలు పెరగడం, బలమైన అమెరికన్ కరెన్సీ, పెరుగుతున్న మధ్యప్రాచ్య ఉద్రిక్తతల వల్ల ఏర్పడిన తీవ్రమైన ప్రపంచ అస్థిరత కారణంగా ఇది తగ్గింది. ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారకంలో రూపాయి 91.23 వద్ద ప్రారంభమైంది ఇది మునుపటి ముగింపు స్థాయి కంటే 21 పైసలు తక్కువగా ట్రేడవుతోంది. . దేశీయ ఈక్విటీ మార్కెట్లలో ప్రతికూల సెంటిమెంట్,  భారత కరెన్సీపై ఒత్తిడి […]

యుద్ధం ప్రభావంతో స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం

ఈరోజు భారత స్టాక్ మార్కెట్‌లో “బ్లాక్ మండే” పరిస్థితి ఏర్పడింది. సెన్సెక్స్, నిఫ్టీ పెద్ద మొత్తంలో తగ్గుదల చూశాయి. వెస్ట్ ఏషియాలో యుద్ధం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడిదారులు షేర్లను అమ్మడం వంటి కారణాలు ప్రధానంగా ప్రభావితం చేశాయి. మార్చి 2న సెన్సెక్స్ 1,638.94 పాయింట్లు, అంటే 2.02% తగ్గి 79,648.25 వద్ద కొనసాగింది. నిఫ్టీ 502.30 పాయింట్లు, అంటే 1.99% తగ్గి 24,676.35 వద్ద ఉంది. 550 షేర్లు పెరిగాయి, 3,410 షేర్లు […]

బ్లాక్’ కంపెనీలో 4 వేల మందిపై వేటు.. ఒక్కసారిగా 30 శాతం దూసుకెళ్లిన స్టాక్ ధర

ట్విట్టర్ మాజీ సీఈఓ జాక్ డోర్సేకు ప్రముఖ సంస్థ బ్లాక్.. ఏకంగా 4 వేల మందికిపైగా ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఏఐ వాడకాన్ని పెంచే ఉద్దేశంతోనే లేఆఫ్స్ ప్రకటించిందిఅయితే లేఆఫ్స్ ప్రకటన తర్వాత బ్లాక్ షేర్ ధర భారీగా దూసుకెళ్లింది. సాధారణ ట్రేడింగ్‌లో 5 శాతం పెరిగి 54.53 డాలర్ల వద్ద స్థిరపడగా.. ఎక్స్‌టెండెడ్‌ ట్రేడింగ్‌లో (ఆఫ్టర్ అవర్స్ ట్రేడింగ్) మరో 23 శాతం దూసుకెళ్లి 67.36 డాలర్ల వద్ద, ఇలా ఓవరాల్‌గా 30 శాతం వరకు […]

ముఖేష్ అంబానీ ఇంట హిల్లరీ క్లింటన్.. ఘన స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ దంపతులు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌కు ఘన స్వాగతం పలికారు. ముంబైలోని తమ నివాసంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక ఆతిథ్య కార్యక్రమంలో వారి కుమార్తె ఇషా అంబానీ కూడా పాల్గొన్నారు. భారత్, అమెరికా దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక, సామాజిక సంబంధాలను, ఇరు దేశాల స్నేహాన్ని మరింత బలోపేతం చేసేలా సాగింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON