ఇరాన్ తో యుద్ధం తొలినాళ్లలో భారీగా సైనిక నష్టాన్ని చవిచూసిన అమెరికా.. కాస్త ఆలస్యంగానైనా దాన్నుంచి తేరుకుంది. ఇరాన్ షాహెద్ డ్రోన్లకు విరుగుడుగా ‘మెరోప్స్’ ఇంటర్ సెప్టర్ డ్రోన్లను రంగంలోకి దించింది. ఇతర ఇంటర్సెస్టర్
వ్యవస్థలతో పోలిస్తే చాలా చౌకగా లభించే ఈ ‘తేనెపిట్టలు’.. అగ్రరాజ్యంపై యుద్ధ భారాన్ని భారీగానే తగ్గించాయట. ఇరాన్తో యుద్ధం మొదలైన వారం రోజుల్లోనే తాము 13వేల ‘మెరోప్స్ ‘ను కొనుగోలు చేసినట్లు సైనిక కార్యదర్శి డేనియల్ వెల్లడించారు.

