దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గకుండా డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కొత్త నాయకత్వానికి అవకాశం వస్తుందని ప్రతిపక్షాలు డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. డీలిమిటేషన్పై కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయి. మహిళల రిజర్వేషన్లకు ఎంఐఎం వ్యతిరేకం. ఈ అంశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ను కలిపింది ఎంఐఎం పార్టీయే. సీఎం రేవంత్రెడ్డిది హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్మాలా” అని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

