నాసిక్ జైలులో తనపై సహఖైదీలు దాడి చేసినట్లు టీసీఎస్ నాసిక్ క్యాంపస్ కేసు కీలక నిందితుడు షఫీ షేక్ ఆరోపించాడు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా జడ్జి ఇన్-కెమెరా విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా నిందితుడు ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇద్దరు నిందితులకు కోర్టు ఈనెల 18 వరకు పోలీస్ కస్టడీ విధించింది. నాసిక్‌లోని టీసీఎస్ క్యాంపస్‌లో లైంగిక వేధింపులు, మత మార్పిడుల యత్నాలకు సంబంధించి 9 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి.

