తమ పార్టీ నేతల సోషల్ మీడియా అకౌంట్లను అకారణంగా సస్పెండ్ చేశారంటూ యూత్ కాంగ్రెస్ నేతలు మెటా సంస్థపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఢిల్లీ, అహ్మదాబాద్ వంటి నగరాల్లో కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌ను లక్ష్యంగా చేసుకుని వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ‘మార్క్ బీజేపీబర్గ్’ (Mark BJPberg), ‘మెటా బీజేపీ కా బేటా’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. మెటా సంస్థ అధికార బీజేపీ, ఆరెస్సెస్‌లకు అనుకూలంగా పనిచేస్తోందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.