ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిళ్లపై ఓ సింహాన్ని వెంబడించడం.. తప్పించుకోవడానికి యత్నిస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గుజరాత్‌లోని ధారిలో ఉన్న అంబార్డీ సఫారీ పార్క్ లో ఎన్‌క్లోజర్ నుంచి ఓ భారీ సింహం తప్పించుకొంది. దానిని తిరిగి వెనక్కి పంపించేందుకు కొందరు అటవీశాఖ సిబ్బంది మోటార్ సైకిళ్లపై దాని వెంటపడ్డారు. అదేమో వారి బారి నుంచి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. చివరకు దానిని ఎన్‌క్లోజర్‌లోకి తరలించినట్లు సమాచారం. దీంతో చర్యలు తీసుకొన్నారు. సదరు అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించారు.