తెలంగాణ వేదికగా డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఎనిమిదో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లోగో, మస్కట్ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఆవిష్కరించారు. డిసెంబర్ 11న జరిగే ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించారు. హైదరాబాద్ మరియు జిల్లా కేంద్రాల్లో గేమ్స్ నిర్వహణకు స్టేడియాలు సిద్ధం చేసినట్లు కేంద్ర మంత్రి మాండవీయకు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 27 క్రీడాంశాల్లో 7,000 మందికి పైగా క్రీడాకారులు తలపడనున్నారని తెలిపారు.