మండల-మకరవిళక్కు యాత్ర కోసం ప్రసిద్ధ శబరిమల శ్రీ అయ్యప్పస్వామి ఆలయం తలుపులు నేడు తెరచుకోనున్నాయి.ఈ సాయంత్రం 5 గంటలకు ఆలయ ప్రధాన తంత్రి కందరారు బ్రహ్మదత్తన్ సమక్షంలో ప్రస్తుత మేల్శాంతి ఈడీ ప్రసాద్ నంబూద్రి ఆలయ ద్వారాలను తెరుస్తారు. ఈ వేడుకతో రెండు నెలల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో సాగే శబరిమల మండల యాత్రా కాలం మొదలవుతుంది. జనవరి 14న మకరవిళక్కు పూజ జరగనుండగా, అదే నెల 19వ తేదీ వరకు భక్తులకు దర్శన అవకాశం ఉంటుంది. జనవరి 20న ఆలయాన్ని మూసివేస్తారు.