కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో కాంగ్రెస్ మరో 30 ఏళ్లపాటు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యవహారశైలిని తప్పుబడుతూ ఆయనపై విమర్శలు చేశారు. దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా రాహుల్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నిరాధార ఆరోపణలు చేయడమే రాహుల్ పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు చేయడం మానుకుని దేశంలోని గ్రామాల్లో పర్యటించాలని అమిత్ షా సూచించారు.