పైలట్ అవసరం లేకుండా పనిచేసే విద్యుత్ విమానాల ప్రయోగం చైనాలో విమానయాన రంగంలో ఆసక్తి రేపుతోంది. ఐదు స్వయంచాలక విద్యుత్ విమానాలను ఒకేసారి గగనతలంలో నడిపిన ఈ ప్రయోగం ద్వారా చైనా సరికొత్త సాంకేతిక విజయాన్ని సాధించింది. ఈ విమానాలు పరస్పర సమన్వయంతో ప్రయాణించాయి. ప్రధాన విమానం 133 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించింది. ప్రయోగం సుమారు 47 నిమిషాలపాటు కొనసాగింది. భవిష్యత్తులో పైలట్ల అవసరం లేకుండానే ప్రయాణికులను, సరుకులను తరలించే విమానాలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.