టీడీపీ ప్రకటించిన జాబితాలో ప్రధానంగా మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ అభ్యర్ధిగా పేరం ఏడుకొండలు పేరును ఖరారు చేశారు. అలాగే మున్సిపాలిటీల్లో ఛైర్ పర్సన్ అభ్యర్ధులుగా ఆముదాలవలసకు కూన ప్రమీల, తణుకుకు బసవ వి.వి. రామకృష్ణ, పాలకొల్లుకు ఆబోతుల ఉషారాణి, వైఎస్సార్ తాడిగడపకు పీతా గోపీచంద్, గుడివాడకు మారీదు కరుణ, నరసరావుపేటకు నాగసరపు రూపేష్ గుప్తా, పొన్నూరుకు కండ్రు విజయలక్ష్మిని ప్రకటించారు. అలాగే కందుకూరుకు పిడికిటి వెంకటేశ్వర్లు, గూడూరుకు చౌటూరి శిరీష, శ్రీకాళహస్తికి పేట బాలాజీని మున్సిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్ధులుగా ప్రకటించారు.