ఆంధ్రప్రదేశ్లోని రాప్తాడులో రంపం దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై మంత్రి నారా లోకేశ్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఇటీవల చిన్నారికి నిర్వహించిన సర్జరీ విజయవంతం కావడంతో ఆమె ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని వెల్లడించారు. ప్రస్తుతం బాలిక వేగంగా కోలుకుంటోందని, ఆక్సిజన్ స్థాయులు ఆరోగ్యకరంగా ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా, ఆమె నోటి ద్వారా ఆహారం తీసుకుంటోందని పేర్కొన్నారు.చిన్నారి కోలుకునే ప్రక్రియను వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని లోకేశ్ వెల్లడించారు.