పేద, మధ్యతరగతి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా నెల్లూరులో అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం శరవేగంగా జరుగుతోందని మంత్రి తెలిపారు. రూ.20 కోట్ల సీఎస్ఆర్ (CSR) నిధులతో నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక పాఠశాల వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. నెల్లూరు జిల్లా ప్రజల దశాబ్దాల తాగునీటి సమస్యకు త్వరలోనే తెరపడనుందని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు. జిల్లాలో రూ.550 కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన తాగునీటి పథకం పనులు తుది దశకు చేరుకున్నాయని వివరించారు.