ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం రావినూతలలో గిరిబాబు భౌతికకాయానికి మోహన్ బాబు నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తన స్నేహితుడు గిరిబాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తమది 55 ఏళ్ల సాన్నిహిత్యమని వెల్లడించారు. చాలామంది నటులు తాము పుట్టిన ఊరిని పట్టించుకోరని, కానీ గిరిబాబు తాను పుట్టిన ఊరి కోసం ఎంతో చేశారని మోహన్ బాబు అన్నారు. నేను ఒక గొప్ప స్నేహితుడిని, ఆత్మీయుడిని పోగొట్టుకున్నాను” అంటూ మోహన్ బాబు ఎమోషనల్ గా మాట్లాడారు.