క్రిస్మస్, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని విజయవాడ నోవాటెల్‌లో శనివారం కేక్ మిక్సింగ్ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఇందులో డ్రై ఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాలు, ఇతర పానీయాలు కలిపి ప్రత్యేక డబ్బాల్లో పొందుపర్చారు. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు హోటల్‌కు వచ్చే అతిథులకు ప్రత్యేక కేకుల్లో వీటిని వినియోగిస్తారు. విజయవాడలోని గ్రాండ్ జీఆర్టీ హోటల్స్‌లో క్రిస్మస్ పండుగ సీజన్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ‘లూమీ ది హోప్ ఆఫ్ లైట్’ పేరుతో కేక్ మిక్సింగ్ కార్యక్రమాలతో నిర్వాహకులు ఈ సంబరాలకు శ్రీకారం చుట్టారు.