తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా చలి ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతుండటంతో ప్రజలు చలికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 11.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డిలో 11.3, కామారెడ్డిలో 11.4, వికారాబాద్ 11.8 డిగ్రీలు నమోదయ్యాయి. అలాగే సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 12.5 డిగ్రీలు, రంగారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో 12.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.