పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించి అండర్-19 ఆసియా కప్‌ను సొంతం చేసుకున్న భారత యువ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టోర్నీలో అద్బుత ప్రదర్శన కనబర్చిన క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. 5 ఇన్నింగ్స్‌ల్లో 361 పరుగులతో రాణించాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. క్రికెట్ దిగ్గజాలు వీరేంద్ర సెహ్వాగ్, సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ తదితరులు టీమిండియా కుర్రాళ్ల పోరాట పటిమను కొనియాడారు. ఎక్స్ వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు.