దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడుతోందని కాంగ్రెస్ అగ్రనేత, రాహుల్ గాంధీ విమర్శించారు. 2014 నుంచి దేశంలో ఫాసిస్టు భావజాలం బలంగా వినిపిస్తోందని, అప్పటి నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే పరిణామాలు ప్రారంభమయ్యాయని ఆరోపించారు. హైదరాబాద్లో నిర్వహించిన భారత్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన.. దేశ రాజకీయ పరిస్థితులు, ఎన్నికల నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో ప్రజాస్వామ్య వ్యవస్థ ధ్వంసమైందని, రాజకీయాల్లోకి భారీగా డబ్బు ప్రవేశించిందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత కీలకమైన ప్రక్రియ అని, వాటి నిర్వహణలో పారదర్శకత ఉండాలని అభిప్రాయపడ్డారు.