హైదరాబాద్‌లో నిర్వహించిన బైక్ ర్యాలీలో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. పింక్ డ్రైవర్ లలిత అనే మహిళ స్కూటీ నడుపుతుండగా.. రాహుల్ వెనుక కూర్చొని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లలిత.. తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘రాహుల్ గాంధీ లాంటి లీడర్‌ను నా బైక్ మీద తీసుకెళ్లే అదృష్టం రావడం చాలా సంతోషంగా ఉంది. కూర్చోగానే హలో.. అంటూ నన్ను పలకరించారు. మా కుటుంబ వివరాలతో పాటు గిగ్ వర్కర్‌గా నా జర్నీ గురించి అడిగి తెలుసుకున్నారు.