టాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రముఖ సినీనటుడు గిరిబాబు (80) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో 1946 జూన్ 8న గిరిబాబు జన్మించారు. సుదీర్ఘ సినీకెరీర్లో గిరిబాబు 600కు పైగా చిత్రాల్లో నటించారు.