పంచాయతీ ఎన్నికల సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు SEC అనిల్ చంద్ర పునేఠా. దాడి ముప్పు ఉందని అభ్యర్థులు జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేస్తే, నామినేషన్ల సమర్పణకు ప్రత్యేక ఎస్కార్ట్‌తో పాటు తగిన భద్రత కల్పిస్తామని ఎస్ఈసీ భరోసా ఇచ్చారు. ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు 5 వేల వరకు జనాభా ఉన్న గ్రామాలకు రూ. 15 లక్షలు, 5-10 వేల జనాభా ఉన్న గ్రామాలకు రూ. 25 లక్షల చొప్పున నిధులు మంజూరవుతాయని వివరించారు.