ఆన్లైన్లో అన్ని ఫ్లాట్‌ఫామ్‌ల డేటా ఉంది కానీ.. గిగ్ వర్కర్ల డేటా ఇప్పటి వరకు అందుబాటులో లేదు. మీకెంత జీతం వస్తుంది మీరెంత సంపాదిస్తున్నారో ఎవరికీ తెలియదు. ఇకపై మీరు సంపాదించే ప్రతీ పైసా లెక్క మీకు తెలుస్తుంది. గిగ్ వర్కర్లు విశ్రాంతి తీసుకునేందుకు సరైన షెల్టర్ కూడా లేదు. తెలంగాణ ప్రభుత్వం వైఫైతో కూడిన షెల్టర్‌ను ఏర్పాటు చేస్తోంది. గిగ్ వర్కర్ల కష్టనష్టాలను స్వయంగా తెలుసుకున్నాను.. వారికి సపోర్ట్‌గా ఉంటాం.. వారి సమస్యలు తీరుస్తాం’’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.